ETV Bharat / bharat

మోదీ అధ్యక్షతన రెండు కేబినెట్​ కమిటీలు - పురోగతి

ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల్లో పురోగతి సాధించేందుకు కేంద్రం రెండు కేబినెట్​ కమిటీలను నియమించింది. ఈ రెండు కమిటీలు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోనే పనిచేయనున్నాయి. నిరుద్యోగంపై విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తోన్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

మోదీ అధ్యక్షతన రెండు కేబినెట్​ కమిటీలు
author img

By

Published : Jun 6, 2019, 6:31 AM IST

మోదీ అధ్యక్షతన రెండు కేబినెట్​ కమిటీలు

ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల్లో పురోగతి సాధించడంపై నరేంద్ర మోదీ సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. మోదీ హయాంలో దేశంలో నిరుద్యోగం తారస్థాయికి చేరిందంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న వేళ.. ఈ కీలక అంశాల బాధ్యతలు చూసుకునేందుకు రెండు కేబినెట్ కమిటీలను కేంద్రం నియమించింది.

పెట్టుబడులు, వృద్ధిరేటు పురోగతిపై ఏర్పాటు చేసిన కమిటీలో కేంద్ర మంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ సభ్యులుగా ఉన్నారు.

ఉద్యోగ కల్పన కోసం నియమించిన కేబినెట్ కమిటీలో అమిత్​షా, నిర్మలా సీతారామన్​, పీయుష్​ గోయల్​తో పాటు కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్., రమేష్ పోక్రియాల్, ధర్మేంద్ర ప్రదాన్, ఎమ్​ఎన్ పాండే, సంతోష్ కుమార్ గంగ్వార్, హార్దిప్ పూరి సభ్యులుగా ఉన్నారు.

ఈ రెండు కమిటీలూ ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో పనిచేయనున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 7.8 శాతం నిరుద్యోగం ఉండగా.. గ్రామాల్లో నిరుద్యోగ యువత 5.3 శాతం ఉన్నట్లు కేంద్ర కార్మికశాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది

Jaipur (Rajasthan), May 06 (ANI): While addressing mediapersons, Deputy Chief Minister of Rajasthan Sachin Pilot spoke about the performance of Congress and also hit at Bharatiya Janata Party (BJP). Pilot said, "I think we've performed really well. Our government's performance in last 3 months is viewed at and will be judged. To my mind, we have done extremely well and also we did more than 150 rallies. We have conducted a very positive campaign all over the state. We have set 'NYAY yojna'. 6% of our GDP will be invested in education sector. We are not making 'jumlas' or false promises. But I think, the narrative that the Congress party evolved is a positive one unlike the BJP which is only talking about the cast, religion, mandir- masjid and Hindu-Muslim. We talk about New India, an aspiration India where job creation takes place."

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.