ETV Bharat / bharat

సీఎం, డిప్యూటీ సీఎంకు హైకోర్టు నోటీసులు - Pleas on AAP

ఇటీవల జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నియమావళిని ఉల్లంఘించారంటూ దిల్లీ సీఎం, డిప్యూటీ సీఎంపై హైకోర్టులో పిటిషన్​​లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో వివరణ కోరుతూ కేజ్రివాల్​, మనీశ్​ సిసోడియాకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం.

Plea in High Court challenging election
దిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం లకు హైకోర్టు నోటీసులు
author img

By

Published : Feb 27, 2020, 3:55 PM IST

Updated : Mar 2, 2020, 6:27 PM IST

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అరవింద్​ కేజ్రీవాల్, మనీశ్​ సిసోడియా నియమావళిని ఉల్లంఘించారని దాఖలైన వ్యాజ్యాలపై విచారణ చేపట్టింది ఆ రాష్ట్ర హైకోర్టు. ఈ పిటిషన్లపై వివరణ కోరుతూ కేజ్రీవాల్, మనీశ్​ సిసోడియాతో పాటు ఎన్నికల కమిషన్​ మీడియా సర్టిఫికేషన్​ అండ్​ మానిటరింగ్​ కమిటీ(ఎమ్​సీఎమ్​సీ)కు జస్టిస్​ వీకే రావుకు నోటీసులు జారీచేసింది.

కేజ్రీవాల్​, సిసోడియా పోలింగ్​కు 48గంటల ముందు ఓటర్లను ప్రభావితం చేశారని తన పిటిషన్​లో పేర్కొన్నారు చంద్ర అనే వ్యక్తి. ఈయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆప్​ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ప్రజా ప్రాతినిథ్య చట్టం, సెక్షన్-126 ప్రకారం ఇలాంటి వాటికి అనుమతి లేదని తెలిపారు చంద్ర. అభ్యర్థులిద్దరూ.. బస్టాండ్​, జనసంచారం అధికంగా ఉండేచోట ఎన్నికల ప్రకటనల గోడపత్రికలను అతికించారని, పోలింగ్​ రోజున కూడా ఓటర్లను ప్రభావితం చేశారని తన పిటిషన్​లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'మీ అమ్మ.. నాన్న పుట్టిందెక్కడ?' ఇకపై తప్పని సరి

Last Updated : Mar 2, 2020, 6:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.