కరోనా వైరస్ సెగ భారత పార్లమెంట్‌కు పాకింది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు సోమవారమే ముగియనున్నట్లు తెలుస్తోంది. రెండు సభల్లో ఆర్థిక బిల్లు ఆమోదం పొందిన అనంతరం సమావేశాలకు ముగింపు పలికే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగాల్సి ఉంది. అయితే దేశంలో కొవిడ్-19 విస్తృతి దృష్ట్యా 12 రోజుల ముందుగానే వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది.
తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ సహా చాలా వరకు రాజకీయ పార్టీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పూర్తి నిర్బంధం విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉభయ సభలు వాయిదా పడటం లాంఛనమే అని తెలుస్తోంది.