హాజరైన అగ్రనేతలు
ప్రధాని నరేంద్ర మోదీ పారికర్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు మిరామర్కు చేరుకుని పారికర్ అంతిమయాత్రకు హాజరయ్యారు.
అంతిమ యాత్ర
అనారోగ్యంతో కన్నుమూసిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను ఉదయం పనాజీలోని భాజపా కార్యాలయం నుంచి ప్రజల సందర్శనార్థం కళా అకాడమీకి చేర్చారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ యాత్ర ప్రారంభించి మిరామర్ తీరానికి చేర్చారు. మిరామర్ బీచ్‌లోని గోవా మొదటి ముఖ్యమంత్రి దయానంద్ బండోద్కర్ స్మారక చిహ్నం పక్కనే పారికర్ అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. అధికారిక లాంఛనాలతో కడసారి వీడ్కోలు పలికారు.