భారత పర్యటనకు విచ్చేస్తున్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారతీయ వంటకాలే కాదు, కిళ్లీ రుచి కూడా చూడనున్నారు. దిల్లీలోని 'పాండే పాన్స్' దుకాణంలో తయారైన పాన్‌ను స్వీకరించనున్నారు.
పాన్ బనానేవాలా..
పాండే పాన్స్ 1943లో ప్రారంభమైంది. ఎలాంటి రసాయనాలు వాడకుండా, నోట్లో వేస్తే కరిగిపోయే కిళ్లీలు తయారు చేయడం ఈ దుకాణం ప్రత్యేకత. భారత ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఒకప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నుంచి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వరకు ఎందరో ప్రముఖులు పాండే కిళ్లీలు రుచిచూశారు.
"మేము ఎలాంటి ఫ్లేవర్లు, రసాయనాలు వినియోగించం. ఏదైనా సహజ రుచులే ఉంటాయి. అంతే కాదు. ఈ పాన్ తిన్నవారెవరూ బయటకు ఊమ్మివేయలేరు. మోదీ చెప్పినట్టు పాన్ ఉమ్మితే, అది భారత్ మాతపైన ఉమ్మివేసినట్టు. అందుకే, మేము కొత్త పద్ధతిని తీసుకొచ్చాం. నికొటిన్ లేని మీఠా, సాదా పాన్లను తయారు చేస్తాం. అవి తిని ఎవ్వరూ ఉమ్మివేయరు. ఇప్పుడు ట్రంప్‌కు ఎలాంటి పాన్ తయారు చేయాలో మేము పరిశోధన చేసి, సిద్ధంగా ఉంచాము."
-దేవీ ప్రసాద్ పాండే, యజమాని
అమెరికా ఒకప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం పాండే పాన్ రుచిచూసి మైమరచిపోయారు. ఇప్పుడు ట్రంప్ నోటినీ ఎరుపు చేసేందుకు సిద్ధమవుతున్నారు పాండే.
ఇదీ చదవండి:ట్రంప్ కోసం 'పోలీస్ అమ్మ' డ్యూటీ- పసి బిడ్డతో కలిసి...