ETV Bharat / bharat

ప్రముఖ ఆలయాల కొత్త టైమింగ్స్​, రూల్స్​ ఇవే...

దేశవ్యాప్తంగా జూన్​ 8 నుంచి ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తెరుచుకోనున్నాయి. అయితే కేరళలోని ప్రసిద్ధ శబరిమల, అనంత పద్మనాభస్వామి ఆలయం, గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయాలు కాస్త ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. ఆలయాలు సందర్శించే భక్తులు కచ్చితంగా కరోనా నివారణ మార్గదర్శకాలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Padmanabha Swami temple
జూన్​ 14 నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం
author img

By

Published : Jun 7, 2020, 2:49 PM IST

దేశవ్యాప్తంగా సోమవారం నుంచి దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు తెరచుకోనున్నాయి. దాదాపు 80 రోజుల తరువాత భక్తులు తమ ఇష్ట దైవాలను కనులారా దర్శించుకునే అవకాశం దక్కనుంది. అయితే వైరస్​ అంతకంతకూ విజృంభిస్తున్న వేళ... భక్తులు కరోనా నివారణ మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

కేరళలోని ప్రసిద్ధ శబరిమల, అనంత పద్మనాభస్వామి ఆలయం, గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయాలు కాస్త ఆలస్యంగా తెరుచుకోనున్నాయి.

శబరిమల అయ్యప్ప దేవాలయం

కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్పస్వామి దేవాలయం మాత్రం జూన్ 14న తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 14న స్వామివారికి మిధననమాస పూజోత్సవం నిర్వహిస్తారు. ఆ రోజు భక్తులు కనులారా తమ స్వామివారిని దర్శించుకోవచ్చని అధికారులు వెల్లడించారు. అయితే కొవిడ్-19 మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

దర్శన వేళలు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, తరువాత సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటాయని అధికారులు తెలిపారు. గంట వ్యవధిలో గరిష్ఠంగా 200 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. గర్భగుడిలోకి 50 మందిని, స్వామివారి అంతరాలయంలోకి ఐదుగురిని మాత్రమే అనుమతిస్తారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు.. కేరళ ప్రభుత్వ ఈ-జాగ్రత్త పోర్టల్​లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పం, అరవణ ప్రసాదం కోసం కచ్చితంగా ఆన్​లైన్ బుకింగ్ చేసుకోవాలి. నెయ్యాభిషేకానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఈ నెలవారీ పూజలు పూర్తయిన తరువాత జూన్​ 28న ఆలయాన్ని మూసివేస్తారు.

Padmanabha Swami temple
జూన్​ 14 నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం

అనంత పద్మనాభ స్వామి దేవాలయం

కేరళ తిరువనంతపురంలోని ప్రసిద్ధ అనంత పద్మనాభస్వామివారి దేవాలయం జూన్ 9న తెరుచుకోనుంది. భక్తులను వర్చువల్ క్యూ పద్ధతి ద్వారా మాత్రమే ఆలయ దర్శనానికి అనుమతిస్తారు.

వేకువ జామున స్వామివారికి చేసే పూజలకు మాత్రం భక్తులను అనుమతించరు. ఉదయం 8.15 నుంచి 11.15 వరకు, సాయంత్రం 4.30 నుంచి 6.30 వరకు దైవ దర్శనం చేసుకోవచ్చు. ఒకసారి ఐదుగురిని మాత్రమే దర్శనం చేసుకోవడానికి అనుమతిస్తారు. మొత్తానికి ఒక రోజులో గరిష్ఠంగా 800 మంది భక్తులను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తారు. కొవిడ్-19 నివారణ మార్గదర్శకాలు పాటించడం తప్పనిసరి.

Padmanabha Swami temple
అనంత పద్మనాభ స్వామి దేవాలయం

గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయం

గురువాయూర్​లోని శ్రీ కృష్ణ ఆలయాన్ని జూన్​ 15న తెరుస్తారు. భక్తులను వర్చువల్ క్యూ పద్ధతిలో అనుమతించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్​లైన్​లో రిజిస్టర్ చేసుకున్న భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తారు.

ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు మాత్రమే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఒక రోజులో గరిష్ఠంగా 600 మంది భక్తులను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తారు. ప్రసాదం, తీర్థం, నైవేద్యం మాత్రం ఇవ్వరు.

Padmanabha Swami temple
ఆలయంలో ఏర్పాట్లు

ఇదీ చూడండి: భక్తులకు మనవి..ఆలయాల్లో ఇవి పాటించండి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.