బిహార్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. సహాయక చర్యల కోసం 21 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకు 6,800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా వరదల కారణంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో బిహార్ ప్రథమ స్థానంలో ఉందని అధికారులు తెలిపారు. గండక్, బుర్హి గండక్, బాగ్మతి, కమలాబాలన్, అధ్వర, కోషి వంటి అనేక నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని చెప్పారు. దీని వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఉత్తర బిహార్‌లోని పలు ప్రాంతాల్లో మరి కొన్ని రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు మరిన్ని బృందాలను వరద ప్రభావిత ప్రాంతాలకు పంపినట్లు తెలిపారు.
ఇదీ చూడండి:'మా ఊర్లో కరోనా లేదు.. వెళ్లిపోండి!'