ETV Bharat / bharat

3 గంటల్లో 4 లక్షల 'నీట్​' హాల్​టికెట్లు డౌన్​లోడ్​

వైద్య విద్య ప్రవేశ అర్హత పరీక్ష నీట్​ హాల్​టికెట్లు డౌన్​లోడ్​ చేసుకునేందుకు వీలు కల్పించింది జాతీయ పరీక్ష నిర్వహణ సంస్థ (ఎన్​టీఏ). తొలి 3 గంటల్లోనే 4లక్షలకుపైగా అభ్యర్థులు తమ అడ్మిట్​ కార్డులను డౌన్​లోడ్​ చేసుకున్నట్లు తెలిపింది.

NEET
3 గంటల్లో 4 లక్షల 'నీట్​' హాల్​టికెట్లు డౌన్​లోడ్​
author img

By

Published : Aug 26, 2020, 4:58 PM IST

వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం జాతీయ అర్హత పరీక్ష (నీట్)ను దేశవ్యాప్తంగా సెప్టెంబరు 13న నిర్వహించనున్నారు. పరీక్ష సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు అడ్మిట్​ కార్డులు విడుదల చేసింది జాతీయ టెస్టింగ్​ ఏజెన్సీ. వెబ్​సైట్​లో అడ్మిట్​​కార్డులు అందుబాటులోకి వచ్చిన కేవలం 3 గంటల్లోనే 4 లక్షలకుపైగా డౌన్​లోడ్​ అయ్యాయి.

సెప్టెంబర్​ 13న నీట్​, సెప్టెంబర్​ 1-6 మధ్య ఇంజినీరింగ్​ ప్రవేశ పరీక్ష జేఈఈ నిర్వహించనున్నారు. జేఈఈ మేయిన్స్​కు 9.53 లక్షల మంది, నీట్​కు 15.97 లక్షల మంది నమోదు చేసుకున్నారు.

కరోనా నేపథ్యంలో నీట్​ వాయిదా వేయాలని పెద్ద సంఖ్యలో విద్యార్థులు డిమాండ్​ చేస్తున్నారు. అయినప్పటికీ.. షెడ్యూల్​ ప్రకారమే పరీక్ష జరుగుతుందని కేంద్ర విద్యాశాఖ అధికారులు మంగళవారం స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: నీట్ పరీక్ష: వారి బాధ్యత కేంద్రానిదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.