ETV Bharat / bharat

'అయోధ్య భూమిపూజను 16కోట్ల మంది వీక్షించారు' - Ram Mandir Bhumi Pujan

అయోధ్యలో రామాలయ భూమిపూజ ప్రత్యక్ష ప్రసారాన్ని రికార్డు స్థాయిలో 16 కోట్ల మంది వీక్షించారు. ప్రసార భారతి ప్రాథమిక అంచనాల ప్రకారం 700 కోట్ల నిమిషాల వీక్షణలు నమోదయ్యాయి.

AYODHYA-VIEWERSHIP-PRASAR BHARATI
అయోధ్య భూమిపూజ
author img

By

Published : Aug 8, 2020, 12:52 PM IST

రామభక్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న అయోధ్య రామమందిర నిర్మాణానికి ఆగస్టు 5న అట్టహాసంగా భూమిపూజ జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ చారిత్రక ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

అయితే ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 16 కోట్ల మంది వీక్షించారని ప్రసార భారతి సీఈఓ శశి శేఖర్ వెంపటి వెల్లడించారు.

"ప్రాథమిక అంచనాల ప్రకారం అయోధ్య భూమిపూజ ప్రత్యక్ష ప్రసారాన్ని 16 కోట్ల మంది వీక్షించారు. దాదాపు 700 కోట్ల వీక్షణ నిమిషాలు నమోదయ్యాయి."

- శశి శేఖర్ వెంపటి, ప్రసార భారతి సీఈఓ

రామమందిర ట్రస్ట్​ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన భూమి పూజ కార్యక్రమాన్ని దూరదర్శన్​ ప్రత్యక్ష ప్రసారం చేసింది. బుధవారం ఉదయం 10.45 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దేశంలో 200 టీవీ ఛానళ్లు దూరదర్శన్​ లైవ్​ కవరేజీని ప్రసారం చేశాయి.

ఇదీ చూడండి: ప్రధాని మోదీ అయోధ్య పర్యటన సాగిందిలా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.