ETV Bharat / bharat

'వందేభారత్​'తో ఇళ్లకు చేరిన 11.2 లక్షల మంది - vande bharat evacuation

వందే భారత్​ మిషన్​ ద్వారా వివిధ మార్గాల ద్వారా విదేశాల్లో చిక్కుకున్న 11.2 లక్షలమందిని భారత్​కు చేర్చినట్లు విదేశాంగ తెలిపింది. ప్రస్తుతం 8 దేశాలతో ఎయిర్​ బబుల్ ఒప్పందం కొనసాగుతుండగా.. మరో 18 దేశాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంచేసింది.

MEA-VANDE BHARAT
వందేభారత్​
author img

By

Published : Aug 21, 2020, 5:10 AM IST

వందేభారత్​ మిషన్​ ద్వారా ఇప్పటివరకు 11.2 లక్షల భారతీయులను స్వదేశానికి చేర్చినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని భారత్​కు తీసుకొచ్చేందుకు మే 7న ఈ మిషన్​ ప్రారంభించింది కేంద్రం.

వందేభారత్ మిషన్​కు సంబంధించి విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీవాస్తవ ఓ ప్రకటన చేశారు.

"వందే భారత్​ మిషన్​లో భాగంగా వివిధ మార్గాల్లో 2020 ఆగస్టు 19 నాటికి 11.23 లక్షల మందిని భారత్​కు చేర్చాం. ప్రస్తుత ఐదో దశలో 22 దేశాల్లో 500 అంతర్జాతీయ, 130 దేశీయ విమానాలు సేవలు అందించాయి. ఆగస్టు చివరి నాటికి మరో 375 విమాన సర్వీసులు నడపనున్నాం."

- అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా..

వందేభారత్​ మిషన్​లో భాగంగా అమెరికా, కెనడా, బ్రిటన్​, ఫ్రాన్స్​, జర్మనీ, యూఏఈ, ఖతార్​, మాల్దీవులతో ఎయిర్​ బబుల్​ ఒప్పందం చేసుకుంది భారత్​. ఈ ద్వైపాక్షిక ఒప్పందాల సాయంతో నిబంధనల మేరకు రెండు దేశాలకు చెందిన విమానాల్లో భారతీయుల తరలింపును చేపట్టింది. మరో 18 దేశాలతో ఎయిర్​ బబుల్​ ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నామని పౌరవిమానయాన శాఖ ప్రకటించింది.

ఈ దేశాల్లో ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్, న్యూజిలాండ్, నైజీరియా, బహ్రెయిన్, ఇజ్రాయెల్​, కెన్యా, ఫిలిప్పీన్స్​, రష్యా, సింగపూర్​, దక్షిణకొరియా, థాయ్​లాండ్​, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక తదితర దేశాలు ఉన్నాయి. ఇది సాధ్యమైతే ఈ దేశాల్లో చిక్కుకున్న వారికి లబ్ధి చేకూరుతుందని శ్రీవాస్తవ తెలిపారు.

ఇదీ చూడండి: కరోనా వేళ సాంక్రామిక వ్యాధుల విజృంభణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.