ETV Bharat / bharat

ఆధార్ చట్ట సవరణపై విపక్షాల విమర్శలు

బ్యాంక్​ ఖాతాలు, మొబైల్​ నంబర్లకు ఆధార్​ అనుసంధానానికి చట్టబద్ధత కల్పించే ఆధార్​ చట్ట సవరణపై లోక్​సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా విపక్షాలు ప్రభుత్వ చర్యను తప్పుబట్టాయి. ఆధార్​ సవరణ బిల్లుకు అనుసరిస్తున్న ప్రక్రియను వ్యతిరేకించారు లోక్​సభలో కాంగ్రెస్​ పక్ష నేత అధిర్​ రంజన్​ చౌదరి.

ఆధార్ చట్ట సవరణపై విపక్షాల విమర్శలు
author img

By

Published : Jul 4, 2019, 6:37 PM IST

లోక్​సభ సమావేశాల్లో భాగంగా సభ ముందుకు ఆధార్​ చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చింది ప్రభుత్వం. బ్యాంక్​ ఖాతాలు, ఫోన్​ నంబర్లకు ఆధార్​ అనుసంధానానికి చట్టబద్ధత కల్పించేందుకు చేపట్టిన సవరణలను తప్పుబట్టాయి విపక్షాలు. గతంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్​ను చట్టం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని విమర్శించారు లోక్​సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్​ రంజన్​ చౌదరి. ఎలాంటి కారణం తెలపకుండానే చట్టం చేసేందుకు చర్యలు చేపట్టిందని ఆరోపించారు.

లోక్​సభలో మాట్లాడుతున్న అధిర్​ చౌదరి

"నేను ఈ ఆర్డినెన్స్​పై జరిగిన ప్రచారాన్ని పలు సందర్భాల్లో తీవ్రంగా వ్యతిరేకించాను. ఈ సభ విధివిధానాలు చూసినా, కార్యచరణ జాబితా చూసినా... ఈ సర్కారు ఆధార్ ఆర్డినెన్స్​ను కారణం లేకుండా ఎలా దుర్వినియోగం చేసిందో మీకే తెలుస్తుంది."

- అధిర్​ రంజన్​ చౌదరి, లోక్​సభలో కాంగ్రెస్​ పక్ష నేత

ఎన్డీఏ ప్రభుత్వం ఆధార్​కు చట్టబద్ధత కల్పించిందని న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ చెప్పిన అంశాన్ని తప్పుబట్టారు చౌదరి. యూపీఏ ప్రభుత్వమే చట్టం తీసుకొచ్చిందన్నారు. మీరు మా నుండి ఆధార్​ అంశాన్ని అప్పుగా తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ఆధార్​ సమాచార గోప్యతను ఎన్డీఏ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని గతంలోనే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు చౌదరి.

వారి హయాంలో ఆధార్​ నిరాధారం

కేంద్ర న్యాయశాఖ మంత్రి సమాధానమిస్తూ ఆధార్​కు గత యూపీఏ ప్రభుత్వం ఎలాంటి చట్టబద్ధత కల్పించలేదన్నారు. వారి హయాంలో ఆధార్​ నిరాధారంగా ఉందన్నారు. భాజపా సర్కారు దాన్ని చట్టంగా మారుస్తోందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: పరువు నష్టం కేసులతో రాహుల్​ బిజీబిజీ

Patna (Bihar), July 04 (ANI): Rashtriya Janata Dal (RJD) MLAs protested outside Bihar Assembly over the deaths of children in state due to Acute Encephalitis Syndrome (AES). Leader of opposition and RJD leader Rabri Devi slammed the state government of doing politics on children's deaths. Rabri Devi had earlier demanded the resignation of state Health Minister Mangal Pandey taking responsibility of deaths due to AES.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.