లోక్‌సభ ఆమోదించిన సమాచార హక్కు చట్టం సవరణ బిల్లుపై రాజ్యసభలో రభస జరిగింది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్... బిల్లు ప్రవేశపెట్టాలని సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌కు సూచించారు.
విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తదుపరి పరిశీలన కోసం బిల్లును సెలెక్ట్ కమిటీకి (నిర్ణయ సంఘం) పంపించాలని తీర్మానాలు అందజేశాయి. ఓటింగ్‌తో కలిసి దీనిపై చర్చ కొనసాగుతుందని డిప్యూటీ ఛైర్మన్ స్పష్టం చేశారు. ఛైర్మన్ వ్యాఖ్యలపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రెండింటిపై వేర్వేరుగా చర్చ జరపాలని పట్టుబట్టి ఆందోళనకు దిగాయి.
డిప్యూటీ ఛైర్మన్ సభను రెండు సార్లు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైనా విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. అయినప్పటికీ డిప్యూటీ ఛైర్మన్ చర్చను కొనసాగించారు.
- ఇదీ చూడండి: 'ముమ్మారు తలాక్ బిల్లు సుప్రీం తీర్పు అనుసరించే'