ETV Bharat / bharat

ఉల్లి గోదాములపై దొంగల కన్ను.. లక్షల్లో స్వాహా

ఉల్లి ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చినందున గోదాములపై దొంగలు విరుచుకుపడుతున్నారు. రైతులు కష్టపడి పండించిన పంటను ఎత్తుకెళ్లి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా బిహార్​లో రూ.8 లక్షలు, మహారాష్ట్రలో లక్ష రూపాయలు విలువైన ఉల్లిని చోరీ చేశారు దొంగలు.

ఉల్లి గోదాములపై దొంగల కన్ను.. లక్షల్లో స్వాహా
author img

By

Published : Sep 24, 2019, 3:14 PM IST

Updated : Oct 1, 2019, 8:00 PM IST

ఉల్లి గోదాములపై దొంగల కన్ను.. లక్షల్లో స్వాహా

దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. ఉల్లిపాయలకు భారీ డిమాండ్ నెలకొంది. ఇదే అదునుగా సొమ్ము చేసుకునేందుకు దొంగలు రెచ్చిపోతున్నారు. గోదాముల్లో దాచుకున్న విలువైన పంటను చోరీ చేస్తున్నారు. తాజాగా బిహార్​లో రూ.8 లక్షలు​, మహారాష్ట్రలో లక్ష రూపాయలు విలువైన ఉల్లిని ఎత్తుకెళ్లిపోయారు.

గోదాములోని ఉల్లి చోరీ...

బిహార్‌ రాజధాని పట్నాలోని ఫతుహా ప్రాంతంలో ఉల్లిగడ్డలను గోదాములో భద్రపరిచాడు ఓ రైతు. దొంగలు దాదాపు 8 లక్షల రూపాయలు విలువైన పంటను చోరీ చేశారు. విషయాన్ని గుర్తించిన రైతు... పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

మహారాష్ట్రలోనూ చోరీ....

మహారాష్ట్రలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. నాసిక్‌ జిల్లాకు చెందిన రాహుల్​ బాజీరావ్ పాగర్​ అనే రైతు.. లక్ష రూపాయలు విలువైన ఉల్లి పంటను దుకాణంలో భద్రపరిచాడు. ఆ ఉల్లిపాయలను దొంగలు ఎత్తుకెళ్లారు. బాజీరావ్​.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు​.

ఉల్లిలో యూరియా...

నాసిక్​లోని భౌర్ గ్రామానికి చెందిన ఓ ఉల్లి రైతుకు ఊహించని ఘటన ఎదురైంది. గోదాములో ఉంచిన ఉల్లిపాయల్లో గుర్తు తెలియని వ్యక్తులు యూరియా కలిపారు. ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ రైతు.

120 టన్నుల ఉల్లిపాయల్లో యూరియా కలిపినందున దాదాపు రూ.5 లక్షలు నష్టం జరిగిందని వాపోయాడు ఆ రైతు.

నాసిక్​లో ప్రస్తుతం క్వింటాల్​ ఉల్లి ధర రూ.3,500 నుంచి రూ.5000 వేలు పలుకుతోంది. దేశ రాజధాని దిల్లీలో కిలో ధర రూ.70 నుంచి రూ.80 వరకు ఉంది.

ఇదీ చూడండి : ఉల్లికి రెక్కలు.. రికార్డు స్థాయిలో ధరలు

AP Video Delivery Log - 0700 GMT News
Tuesday, 24 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0648: SKorea NKorea Talks No access South Korea 4231435
SKorea: NKorea-US nuclear talks could resume soon
AP-APTN-0615: China Economy Briefing AP Clients Only 4231434
China looks unlikely to cut interest rates for now
AP-APTN-0600: SKorea Swine Fever No access South Korea 4231431
More swine flu cases confirmed in SKorea
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.