బ్యాంక్ దొంగతనం కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని 38 సంవత్సరాల తర్వాత పట్టుకున్న ఘటన ఇది. సదరు నిందితుడు దీప్‌సింగ్ రాజ్‌పుత్‌ను రాజస్థాన్ బాడ్మేర్లో గుర్తించి, అరెస్టు చేశారు పోలీసులు.
ఇదీ జరిగింది?
రాజ్‌పుత్‌తో సహా ఏడుగురు దొంగల ముఠా 1982 డిసెంబర్ 30న గుజరాత్ బనస్కాంఠాలోని అమీర్గడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దోపిడీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని అడ్డగించారు. నిందితులు ఆ సమయంలో రూ. 1.32 లక్షలతో పారిపోయే క్రమంలో బ్యాంక్ మేనేజర్‌పై దాడి చేసి, హెడ్ కానిస్టేబుల్‌ను హత్య చేశారు.
పరారైన ఈ ఏడుగురు నిందితుల్లో ఇద్దరిని 1984లో పోలీసులు అరెస్టు చేయగా... మరో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన రాజ్‌పుత్‌ను తాజాగా దాదాపు 38 సంవత్సరాల తర్వాత పట్టుకున్నారు.
ఇదీ చూడండి:ముంబయిలో ఇద్దరు దుబే అనుచరుల అరెస్టు