ఒడిశా పూరీలో 26 ఏళ్ల తర్వాత శనివారం భగవాన్ జగన్నాథుడి నాగార్జున బేషా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాకారులు వివిధ రూపాల్లో జగన్నాథుడి విగ్రహాలు తయారు చేసి ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో పూరీకి చెందిన సాస్వత్ రంజన్ సాహూ అనే కళాకారుడు రూపొందించిన అగ్గిపుల్లల జగన్నాథుడి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షించింది. మూడున్నరవేలకుపైగా అగ్గిపుల్లలతో యుద్ధ వీరుడి రూపంలో జగన్నాథ ప్రభువును తీర్చిదిద్ది ఔరా అనిపించాడు.
" జగన్నాథుడి విగ్రహం తయారీకి 3,635 అగ్గిపుల్లలను వినియోగించాను. దానిని పూర్తి చేసేందుకు 11 రోజుల సమయం పట్టింది."
- సాస్వత్ రంజన్ సాహూ, కళాకారుడు
![an idol of Lord Jagannath with matchsticks](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9700593_artist.jpg)
కార్తీక మాసంలో విష్ణువు మరో అవతారం పరుశరాముడిని కోలుచుకుంటూ జగన్నాథుడిని యుద్ధవీరుడిగా అలంకరించి నాగార్జున బేషా నిర్వహిస్తారు. వెయ్యి చేతులు గల కార్తవీర్యార్జునుడ్ని పరుశురాముడు అంతమొందించినందుకు గుర్తుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారని అక్కడి ప్రజలు చెబుతారు. అలాగే ఆర్జునుడు, అతని కుమారుడు నాగార్జునుడి మధ్య యుద్ధానికి గుర్తుగా చేస్తారని మరికొందరు చెప్తారు. ఈ సందర్భంగా 16 రకాల ఆయుధాలతో జగన్నాథుడిని అలంకరిస్తారు.
ఇదీ చూడండి:గణేశుడికి ఆ తల ఎలా వచ్చింది?