వినోదం ఉండాల్సిందే.. కానీ ఎప్పుడు అనేది వ్యక్తుల విచక్షణపై ఆధారపడి ఉంటుంది. లేకుంటే ఇక్కట్లు ఇంటి వాకిట్లో ఉన్నట్లే అవుతుంది. ఒడిశా మల్కాన్‌గిరి జిల్లా ఆసుపత్రిలోని ముగ్గురు నర్సుల విచక్షణ లేని వినోదం తెచ్చింది పెద్ద కష్టం. కథేంటో చూడండి మరి...
ఇటీవలి కాలంలో విస్తృత ప్రాచుర్యం పొందిన అనుకరణ యాప్ టిక్ టాక్. సినిమాల్లోని పాటలు, డైలాగుల్లో తమను చూసుకుని మురిసిపోయే వీలు కల్పిస్తున్న ఈ యాప్‌నకు యువతలో విశేష ప్రాధాన్యం ఉంది.
మల్కాన్‌గిరి జిల్లా ఆసుపత్రిలో విధుల్లో ఉన్న ముగ్గురు నర్సులు టిక్‌టాక్ చేసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అభినయం బాగుందేమో... నర్సుల వీడియోలకు విస్తృత ప్రచారం లభించింది.
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై జిల్లా వైద్య అధికారి నర్సులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఘటనపై జిల్లా అదనపు వైద్యాధికారి విచారణ జరుపుతున్నారు.
ఇదీ చూడండి: వైరల్: అసలు చిరుత ఇలా ప్రవరిస్తుందా?