కశ్మీర్లో ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం కన్నా రాజకీయం, దేశ వ్యతిరేకత మరొకటి లేదన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. జమ్ముకశ్మీర్ అంశాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సమస్యలపై కాంగ్రెస్ పోరాటం కొ నసాగుతుందని స్పష్టం చేశారు.
జమ్ముకశ్మీర్లో పర్యటించేందుకు వెళ్లిన రాహుల్ గాంధీతో పాటు అఖిల పక్ష నాయకులను శ్రీనగర్ విమానాశ్రయంలో అడ్డుకున్న మరుసటి రోజునే ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.
శ్రీనగర్ నుంచి దిల్లీకి అఖిలపక్ష నాయకులు ప్రయాణించిన విమానంలో ఓ మహిళ కశ్మీర్లోని పరిస్థితులను రాహుల్ గాంధీకి వివరిస్తున్న వీడియోను ట్యాగ్ చేస్తూ ట్విట్ చేశారు ప్రియాంక.
-
How long is this going to continue?This is one out of millions of people who are being silenced and crushed in the name of “Nationalism”.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
For those who accuse the opposition of ‘politicising’ this issue: https://t.co/IMLmnTtbLb
">How long is this going to continue?This is one out of millions of people who are being silenced and crushed in the name of “Nationalism”.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 25, 2019
For those who accuse the opposition of ‘politicising’ this issue: https://t.co/IMLmnTtbLbHow long is this going to continue?This is one out of millions of people who are being silenced and crushed in the name of “Nationalism”.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 25, 2019
For those who accuse the opposition of ‘politicising’ this issue: https://t.co/IMLmnTtbLb
"ఇది ఎంతకాలం కొనసాగుతుంది? జాతీయవాదం పేరిట అణచివేతకు గురవుతున్న లక్షల మంది ప్రజల్లో ఈమె ఒకరు. కశ్మీర్ సమస్యను విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపిస్తున్న వారికి చెప్పేది ఒకటే. కశ్మీర్లో ప్రజాస్వామ్య హక్కులను కాలరాయటం కన్నా రాజకీయం, దేశ వ్యతిరేకత మరొకటి లేదు."
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.
కశ్మీరీల హక్కుల కోసం గళం విప్పాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు ప్రియాంక.
ఇదీ చూడండి: 'ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ పార్టీది ఒకే మాట'