ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు అనుమానాలు లేవనెత్తుతున్నాయన్నారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్.
"ఓటమి అంచున నిల్చున్నప్పుడే రాజకీయ పార్టీలు ఇలాంటి తప్పుడు అనుమానాలు లేవనెత్తుతాయి. మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఈవీఎంలు వినియోగంలోకి వచ్చాయి." -నితీశ్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి
కాంగ్రెస్ నేతలకు మానసిక రోగుల ఆస్పత్రే గతి!
ఎన్నికల ఫలితాల అనంతరం కొందరు కాంగ్రెస్ నేతలకు మానసిక రోగుల ఆస్పత్రులే శరణ్యమన్నారు భాజపా గుజరాత్ అధ్యక్షుడు జీతూ వఘానీ. గుజరాత్ ప్రతిపక్షనేత పరేశ్ ధనాని ట్వీట్‌కు ప్రతిస్పందనగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయతపై అనుమానాలు లేవనెత్తడంపైనా స్పందించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో అనుకూల సర్వే ఫలితాలు వచ్చినప్పుడు ఎలా నమ్మారని ప్రశ్నించారు వఘానీ. కాంగ్రెస్ నేతలు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: 'ఈవీఎంలపై ప్రతిపక్షాలవి అనవసర రాద్ధాంతం'