నిర్భయ సామూహిక అత్యాచార దోషులకు ఉరి అమలుపై సందిగ్ధం నెలకొన్నప్పటికీ.. తిహార్ జైలు అధికారులు ఏర్పాట్లు చేయటంలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం నలుగురిని.. ఉరి అమలు చేసే మూడో నెంబర్ కాంప్లెక్స్‌కి తరలించారు.
"నలుగురు దోషుల్ని ఉరి తీసే ప్రక్రియ జరిగే మూడో నెంబర్ జైలుకి తరలించాం."
-తిహార్ జైలు అధికారి
ప్రస్తుతం వినయ్ శర్మ నాలుగో నెంబర్ జైలులో ఉండగా అక్షయ్, ముఖేశ్, పవన్‌లు రెండో నెంబర్ కారాగారంలో ఉన్నారు.
నలుగురు దోషులైన అక్షయ్ కుమార్ సింగ్, వినయ్ శర్మ, ముఖేశ్ కుమార్ సింగ్, పవన్ గుప్తాలకు జనవరి 22న ఉరిశిక్ష అమలుచేసేందుకు నిర్ణయంచారు. అయితే ముఖేశ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్ష అమలును వాయిదా వేయాలని దిల్లీ ప్రభుత్వం బుధవారం.. హైకోర్టుకు తెలిపింది.
ఇదీ చదవండి: చారిత్రక ఒప్పందంతో ఆ శరణార్థులకు శాశ్వత నివాసం