ETV Bharat / bharat

'ఆరు నెలల్లో 175 వాయు నాణ్యత కేంద్రాలు!'

జాతీయ శుద్ధ వాయు కార్యక్రమానికి సంబంధించి కేంద్రం తీరుపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంత పరిమితికి మించి కాలుష్యాన్ని తగ్గించలేమని చేసిన కేంద్రం వాదన.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. ఆరు నెలల్లోగా దేశవ్యాప్తంగా 175 వాయు నాణ్యత పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

NGT
జాతీయ హరిత ట్రైబ్యునల్
author img

By

Published : Aug 25, 2020, 3:50 PM IST

దేశవ్యాప్తంగా 175 వాయు నాణ్యత పరిశీలన కేంద్రాలను ఆరు నెలల్లో ఏర్పాటు చేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్​జీటీ) ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి జాతీయ కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించింది.

జాతీయ శుద్ధ వాయు కార్యక్రమం కోసం నివేదిక రూపొందించిన తీరుపై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖపై ఎన్​జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2024 నాటికి 20 నుంచి 30 శాతం వాయు కాలుష్యం తగ్గిస్తామని తమ నివేదికలో పేర్కొనడాన్ని తప్పుబట్టింది. అది సాధ్యమేనా అని ప్రశ్నించింది జస్టిస్​ ఏకే గోయల్ నేతృత్వంలోని ఎన్​జీటీ ధర్మాసనం.

"కేంద్ర పర్యావరణ శాఖ వాదన.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21కు విరుద్ధంగా ఉంది. కొంత పరిమితి వరకు తప్ప కాలుష్యాన్ని తగ్గించలేమని చేసిన వాదన రాజ్యాంగ, చట్టబద్ధమైన స్ఫూర్తిని నేరుగా దెబ్బతీస్తుంది. శుద్ధ గాలిని పొందే హక్కు అంటే జీవించే హక్కు లాంటిది. వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో విఫలమైతే ఆ హక్కును నిరాకరించడమే. ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 175 వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి."

- ఎన్​జీటీ ధర్మాసనం

ఇదీ చూడండి: భారత ఉపగ్రహం ఆస్ట్రోసాట్ అరుదైన ఘనత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.