మానవత్వానికి మచ్చ తెచ్చే సంఘటన దేశ రాజధాని దిల్లీలోని శాహదరాలో జరిగింది. నవజాత ఆడ శిశువును ఎవరో రోడ్డు పక్కన వదిలేశారు. గీతా కాలనీలో రోడ్డు పక్కనే శిశువు ఏడుపు విన్న ఓ మహిళ.. స్థానికులకు విషయాన్ని తెలియజేసింది. వెంటనే ఆ శిశవును రక్షించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ పసిపాపను చాచా నెహ్రూ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
రెండు రోజుల వయస్సు...
ఆసుపత్రిలో చేర్పించే సమయానికి శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు వైద్యులు. సరైన సమయంలో చికిత్స అందించడం వల్ల ఆడబిడ్డ ప్రాణాపాయం నుంచి గట్టెక్కినట్టు స్పష్టం చేశారు. పాపకు రెండు రోజుల వయస్సు ఉంటుందన్నారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఘటనా స్థలంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పాపను రోడ్డు పక్కన వదిలేసింది.. ఎవరు? కారణం ఏమై ఉంటుందనే కోణంలో విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి: లైవ్ వీడియో : కానిస్టేబుల్ చాకచక్యంతో మహిళ ప్రాణం సేఫ్