దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తమిళనాడులో కొత్తగా 5,994 మంది వైరస్ బారిన పడ్డారు. 119 మంది మరణించారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 2 లక్షల 38 దాటింది. మరణాల సంఖ్య 5 వేలకు చేరువైంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో తాజాగా 4,571 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 22 వేలు దాటింది. మృతుల సంఖ్య 2,069కు పెరిగింది.
4 వేల కేసులు
బిహార్‌లో ఒక్కరోజే 3,934 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80వేలకు చేరువైంది.
- దిల్లీలో ఒక్కరోజులో నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కొత్తగా 1,300 కేసులు వెలుగుచూశాయి. మరో 13 మందిని మహమ్మారికి బలయ్యారు.
- కేరళలో ఒక్కరోజే 1,211 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో ఇద్దరు మృతి చెందారు.
- ఝార్ఖండ్‌లో 1,084 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు 168 మంది చనిపోయారు.
- కర్ణాటక ఆరోగ్య మంత్రికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ఇదీ చూడండి: ఐదు రోజులుగా నదిలో చిక్కుకున్న వ్యక్తి సేఫ్