ETV Bharat / bharat

ఎన్​సీసీ క్యాడెట్స్​కు గుడ్​న్యూస్- ఆ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా! - Paramilitary forces

కేంద్ర సాయుధ పోలీసు దళాల(సీఏపీఎప్ఎస్) నియామకాల్లో నేషనల్​ క్యాడెట్​ కార్ప్స్​(ఎన్​సీసీ) ధ్రువీకరణ పత్రాలున్నవారికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. నియామక పరీక్షల్లో వారికి బోనస్​ మార్కులు కలుస్తాయని వెల్లడించింది. యువత ఎన్​సీసీలో చేరేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని, రాష్ట్రాలు కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని కోరారు అమిత్​ షా.

NCC certificate holders to get preference in paramilitary forces
ఎన్​సీసీ పత్రం ఉంటే పోలీస్​ పరీక్షల్లో బోనస్​ మార్కులు
author img

By

Published : Mar 19, 2020, 5:41 PM IST

భవిష్యత్​లో జరగబోయే కేంద్ర సాయుధ పోలీసు దళాలు(సీఏపీఎప్ఎస్​​) నియామక పరీక్షల్లో ఎన్​సీసీ ధ్రువీకరణ పత్రం కలిగినవారికి బోనస్​ మార్కులు ఉంటాయని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల నియామకంలో కూడా ఎస్​సీసీ ధ్రువీకరణ పత్రం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలను కోరారు అమిత్​ షా.

యువత సంఖ్య పెరగడానికే!

ఎన్​సీసీలో చేరేందుకు యువత ఆసక్తి చూపించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలను నిజం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని, ఈ నిర్ణయ వల్ల సాయుధ దళాలకు మరింత బలం చేకూరుతుందని హోంమంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.

ఎంత శాతం?

ఎన్​సీసీలో మూడు కేటగిరీలుగా ఏ,బీ,సీ ధ్రువపత్రాలు ఉంటాయి. వాటిలో ఎన్​సీసీ 'సీ' ధ్రువపత్రం ఉన్నవారికి 5శాతం 'బీ' ఉంటే 3, 'ఏ' ఉంటే 2శాతం బోనస్​ మార్కులు కలుపుతారు. ప్రస్తుతం ఎన్​సీసీ ధ్రువపత్రం కలిగినవారు భవిష్యత్​లో జరగబోయే సీఏపీఎఫ్​ ఎస్​ఐ, కానిస్టేబుల్​ నియామక పరీక్షల్లో ఉపయోగపడుతుంది.

ఇదీ చూడండి: ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది ఇక 'వర్క్​ ఫ్రమ్​ హోమ్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.