దీపావళి పండగ వేడుకలను దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా.. హరిత ట్రైబ్యునల్ మార్గదర్శకాల మేరకు పర్యావరణహిత బాణసంచాలను ఉపయోగిస్తున్నారు.
దిల్లీలో నవంబర్ 30 వరకు అన్ని రకాల బాణసంచాపై నిషేధం విధించింది హరిత ట్రైబ్యునల్. కానీ.. దక్షిణ దిల్లీ, పహాడ్గంజ్ మొదలైన ప్రాంతాల్లో కొందరు బాణసంచా కాలుస్తూ కనిపించారు.
మరోవైపు దిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ఆలియా దర్గా వద్ద అల్లాను నమ్ముకునే ముస్లిమేతరులు దీపాలు వెలిగించారు. రంగు రంగుల విద్యుద్దీపాల వెలుగులతో దర్గా ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ముస్తాబైన ముఖ్య ప్రాంతాలు..
పశ్చిమ్ బంగాలోని హౌరా బ్రిడ్జి వివిధ రకాల విద్యుద్దీపాల వెలుగులతో ముస్తాబై చూపరులకు కనువిందు చేసింది.
దిల్లీలోని పార్లమెంట్ భవనం, ఉత్తర, దక్షిణ బ్లాక్లు విద్యుద్దీపాల వెలుగుల్లో విరజిమ్మాయి.
ఇదీ చదవండి:'రక్తపాతం ఆపేందుకు భారత్-పాక్ చర్చలు చేపట్టాలి'