ETV Bharat / bharat

'విపక్షాల గొంతు నొక్కేస్తున్నారనడం అవాస్తవం'

రాజ్యసభలో విపక్షాల గొంతు అణచివేస్తున్నారని ఎంపీలు చేసిన ఆరోపణలను ఖండించారు ఛైర్మన్​ వెంకయ్య నాయుడు. స్టాండింగ్​ కమిటీల పరిశీలన లేకుండానే సభలో బిల్లులు ఆమోదం పొందుతున్నాయని 14 పార్టీల ఎంపీలు లేఖ ద్వారా సభాపతికి ఫిర్యాదు చేశారు.

'విపక్షాల గొంతు నొక్కేస్తున్నారనడం అవాస్తవం'
author img

By

Published : Jul 29, 2019, 9:12 PM IST

సభలో విపక్షాల గొంతు నొక్కేస్తున్నారని 14 పార్టీలకు చెందిన 15 మంది సభ్యులు రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను ఖండించారు వెంకయ్య.

పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీ పరిశీలన లేకుండానే సభలో బిల్లులు ఆమోదం పొందుతున్నాయని లేఖలో ఎంపీలు పేర్కొన్నారు. లేఖలోని సారంశంపై మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అయితే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది మంచిది కాదన్నారు.

ఈ లోక్​సభ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపలేదని 15 మంది ఎంపీలు ఫిర్యాదు చేయాలనుకుంటే.. అది తన పరిధిలో లేదన్నారు వెంకయ్య. ఈ విషయంపై తాను స్పందించనని చెప్పారు.

ఎగువసభలో ప్రవేశపెట్టిన బిల్లులకు సంబంధించి పరిశీలనపై వాస్తవాలు తెలిపేందుకు సిద్ధమని స్పష్టం చేశారు వెంకయ్య. తన వద్దకు వచ్చిన 10 బిల్లుల్లో 8బిల్లులను సంబంధిత శాఖల పరిశీలనకు పంపినట్లు తెలిపారు.

స్టాండింగ్ కమిటీ పరిశీలన అనంతరం లోక్​సభలో ఆమోదం పొందిన మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును ఎగువసభలో ఆమోదం పొందేందుకు స్టాండింగ్​ కమిటీకి పరిశీలన నిమిత్తం పంపినట్టు చెప్పారు. ప్రస్తుత సమావేశాల్లో రాజ్యసభలో ప్రవేశపెట్టిన 4 బిల్లుల్లో మూడు ఆమోదం పొందినట్లు తెలిపారు సభాపతి.

స్వల్పకాలిక చర్చలకు సమయం సరిపోవట్లేదని లేఖలో ఎంపీలు చేసిన ఫిర్యాదుపై వివరణ ఇచ్చారు వెంకయ్య. ప్రతివారం ఒక చర్చ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సభలో ఇలాంటి చర్చలు నిర్వహించడం తక్కువ అని గత వివరాల ఆధారంగా తెలియజేశారు. ప్రస్తుత సమావేశాల్లో రెండు సార్లు స్వల్పకాలిక చర్చలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మరో చర్చ జరిగే అవకాశం ఉందన్నారు.

"సభలో విపక్షాల గొంతుకను అణచివేస్తున్నారనే ఆరోపణలు అవాస్తవం. ఈ వివరాల ద్వారా అది స్పష్టం అవుతోంది. ఫిర్యాదును పరిశీలించాల్సిన అవసరం లేదు. సభలో సభ్యుల హక్కులకు ఇతరులు భంగం కల్గించకుండా చూసుకోవడం సభాపతిగా నా బాధ్యత.

-వెంకయ్య నాయుడు, రాజ్యసభ ఛైర్మన్

Intro:Body:

o

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.