ETV Bharat / bharat

రైల్వే స్టేషన్​కు పోటెత్తిన కూలీలు- పోలీసుల లాఠీచార్జ్ - Mumbai police latestnews

ముంబయి బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రత్యేక రైళ్లలో స్వస్థలాలకు వెళ్లేందుకు రిజర్వేషన్ లేని వారు సైతం తరలివచ్చారు. ఒకేసారి స్టేషన్​కు పోటెత్తిన వేలాది మందిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు.

bandra railway station migrants
బాంద్రా రైల్వేస్టేషన్​ బయట వలసకూలీలు గుంపు
author img

By

Published : May 19, 2020, 3:45 PM IST

వేల మంది వలస కార్మికులు ఒక్కసారిగా ముంబయి బాంద్రా రైల్వే స్టేషన్​కు తరలిరావడం ఉద్రిక్తతలకు దారితీసింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది.

బాంద్రా రైల్వేస్టేషన్​ బయట వలసకూలీలు

ఇదీ జరిగింది..

బిహార్​కు చెందిన వలస కూలీల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక్ రైలు ఏర్పాటు చేసింది. ఈ రైలులో బాంద్రా నుంచి పూర్ణియా వెళ్లేందుకు 1000 మంది రిజర్వేషన్​ చేయించుకున్నారు. అయితే... టికెట్ లేకపోయినా ముంబయిలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వలస కార్మికులు ఒక్కసారిగా బాంద్రా స్టేషన్​కు తరలివచ్చారు. రైలులో ప్రయాణించేందుకు తమను కూడా అనుమతించాలని నిరసనకు దిగారు.

ఈ హఠాత్​ పరిణామంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రిజర్వేషన్​ ఉన్నవారిని మాత్రమే రైలు ఎక్కేందుకు అనుమతించారు. మిగిలినవారిని అక్కడి నుంచి చెదరగొట్టారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.