ETV Bharat / bharat

దేశంలోని ప్రధాన నగరాలన్నీ రెడ్​ జోన్​లోనే.. - covid latest news

లాక్​డౌన్​ గడువు ముగుస్తున్న నేపథ్యంలో.. తాజాగా గుర్తించిన జోన్ల వివరాలను వెల్లడించింది కేంద్రం. దేశ రాజధాని దిల్లీ సహా ఆరు ప్రధాన నగరాలన్నీ రెడ్​జోన్​లోనే ఉన్నట్లు తెలిపింది. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌లు రెడ్‌జోన్‌లోనే ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.

Mumbai, Delhi, Bengaluru, Chennai among 130 Red Zones designated by Centre
దేశంలో ప్రధాన నగరాలు అన్ని రెడ్‌జోన్‌లోనే..!
author img

By

Published : May 1, 2020, 1:55 PM IST

Updated : May 1, 2020, 2:17 PM IST

దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న రెండోదశ లాక్​డౌన్ మే 3తో ముగియనుంది. ఈ నేపథ్యంలో.. ​తదుపరి ఎలా ముందుకెళ్లాలన్న అంశాలపై చర్చించి జోన్లపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. తాజాగా రెడ్​, ఆరెంజ్​, గ్రీన్​ జోన్ల జాబితాను సవరించింది. దేశ రాజధాని దిల్లీ సహా మెట్రోపాలిటన్​ నగరాలైన ముంబయి, కోల్​కతా, హైదరాబాద్​, పుణె, బెంగళూరు, అహ్మదాబాద్​ రెడ్​జోన్​లోనే ఉన్నాయని ప్రకటించారు అధికారులు. లాక్​డౌన్​ తర్వాత వారం రోజుల వరకు ఇది అమల్లో ఉండనుందని తెలిపారు. దీని ప్రకారం.. ఈ రెడ్​జోన్లలో లాక్​డౌన్ కొనసాగించేందుకే ప్రధాని మొగ్గుచూపనున్నట్లు తెలుస్తోంది.

130 జిల్లాలు రెడ్​లోనే...

ఆయా ప్రాంతాల్లో కొవిడ్​ వ్యాప్తి, రెట్టింపు రేటు, టెస్టింగ్​ సదుపాయాలు, అధికారుల చర్యలు ఆధారంగా జోన్లను విభజించింది కేంద్రం. దేశవ్యాప్తంగా 733 జిల్లాల్లో... 130 జిల్లాలు రెడ్​జోన్​లో, 284 ఆరెంజ్​ జోన్​లో ఉండగా.. గ్రీన్​జోన్​లో 319 జిల్లాలున్నాయి.

అత్యధికంగా ఉత్తర్​ప్రదేశ్​లో 19 జిల్లాలు రెడ్​జోన్​లో ఉన్నాయి. మహారాష్ట్రలో 14, తమిళనాడులో 12, దిల్లీలో 11, గుజరాత్​లో 9 జిల్లాల్ని ఈ జాబితాలో చేర్చింది కేంద్రం.

zones
దేశంలో కరోనా జోన్ల జాబితా

కరోనా తీవ్రతను బట్టి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఈ మేరకు లేఖ రాశారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రీతీ సదన్‌. దిల్లీ చుట్టుపక్కల ఉన్న పలు ప్రధాన పట్టణాలు.. ఫరీదాబాద్‌, నోయిడా, మేరఠ్​లు కూడా రెడ్‌జోన్‌లో ఉన్నట్లు ఆమె తెలిపారు. గురుగ్రామ్​, ఘజియాబాద్​ ఆరెంజ్‌జోన్‌లో ఉన్నాయి.

21 రోజులు కేసుల్లేకుంటే..

ఏ జిల్లాలోనైనా కరోనా కేసులు లేకున్నా.. గత 21 రోజులుగా కొత్త కేసులు నమోదుకాకున్నా ఆ ప్రాంతాన్ని గ్రీన్​జోన్​గా ప్రకటిస్తారు. రెడ్​ జోన్​లో వరుసగా 28, ఆరెంజ్​ జోన్​లో 14 రోజులపాటు కరోనా కేసులు నమోదుకాకుంటే.. ఆ ప్రాంతాలు గ్రీన్​జోన్​లుగా మారుతాయి.

Last Updated : May 1, 2020, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.