పార్టీ కార్యాలయంలో ఒక గంట పాటు పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అక్కడి నుంచి ప్రజల సందర్శనార్థం 'కాలా అకాడమీ'కు తరలిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు పారికర్ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. పనాజీలోని మీరమర్లో ప్రభుత్వ లాంఛనాలతో పారికర్ అంత్యక్రియలు జరుగుతాయి.
హాజరుకానున్న భాజపా అగ్రనేతలు
సాయంత్రం మీరమర్లో నిర్వహించే అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ అగ్రనేతలు హాజరుకానున్నారు.