ETV Bharat / bharat

సెప్టెంబర్‌ 27న ఐరాసలో మోదీ ప్రసంగం - మోదీ

భారత ప్రధాని నరేంద్రమోదీ సెప్టెంబర్‌ 27న ఐక్యరాజ్యసమితిలో జరిగే సమావేశంలో ప్రసంగించనున్నారు.  వాతావరణం, అభివృద్ధి సహా పలు ఇతర అంశాలపై మాట్లాడతారని సమచారం.

సెప్టెంబర్‌ 27న ఐరాసలో మోదీ ప్రసంగం
author img

By

Published : Aug 30, 2019, 7:51 AM IST

Updated : Sep 28, 2019, 8:02 PM IST

ప్రధాని నరేంద్రమోదీ సెప్టెంబర్‌ 27న ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. భారత కాలమానం ప్రకారం.. రాత్రి 07:30 గంటల నుంచి 08:00 గంటల వరకు మోదీ ప్రసంగించనున్నారని ఐరాస ప్రాథమిక జాబితాలో వెల్లడించింది. ఈ సమావేశంలో వాతావరణ మార్పులు, ఆరోగ్యం, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, చిన్న ద్వీపాలకు సహకారం వంటి పలు అంశాలపై మోదీ మాట్లాడనున్నట్లు సమాచారం.

దీటైనా సమాధానం

అదే రోజు అర్ధరాత్రి పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ప్రసంగిస్తారు. ఈ సమావేశంలో కశ్మీర్​లో భారత్​ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఇమ్రాన్​ ఆరోపించే అవకాశం ఉంది. ఆయన ఎలాంటి ఆరోపణలు చేసినా దీటుగా జవాబిస్తామని భారత ప్రతినిధులు తెలిపారు.

ఐరాస సమావేశాల కోసం మోదీ సెప్టెంబర్‌ 23న న్యూయార్క్‌ చేరుకోనున్నారు. అక్కడ ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఐరాస సమావేశంలో ప్రసంగిస్తారు. పలువురు ప్రపంచ స్థాయి నాయకులతోనూ మోదీ సమావేశం కానున్నారని సమాచారం.

ఇదీ చూడండి:పర్యావరణహితం: మొక్కగా మారే బొజ్జ గణపయ్య

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 28, 2019, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.