భారత్ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24న ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు. అయితే ట్రంప్ వెంట భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్లే అవకాశం లేదని అధికారిక వర్గాల సమాచారం.
కుటుంబం, ఉన్నతాధికారుల బృందంతోనే ట్రంప్ తాజ్‌మహల్‌ను సందర్శించనున్నట్టు తెలుస్తోంది.
తాజ్‌మహల్ సందర్శనలో ఎన్నో చారిత్రక విషయాలను అమెరికా అధ్యక్షుడు తెలుసుకునే అవకాశముంటుందని... ఇందులో ఎలాంటి అధికారిక చర్చలు జరగవని ఓ సీనియర్ అధికారి తెలిపారు. భారత్ తరఫున అధికారులెవ్వరూ తాజ్‌మహల్‌కు వెళ్లకపోవచ్చన్నారు.
ఈ నెల 24 మధ్యాహ్నం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకుంటుంది ట్రంప్ బృందం. అక్కడ జరగబోయే భారీ రోడ్ షో, 'నమస్తే ట్రంప్' కార్యక్రమం అనంతరం ఆగ్రాకు వెళ్లనున్నారు అమెరికా అధ్యక్షుడు. తాజ్‌మహల్ సందర్శన అనంతరం దేశ రాజధాని దిల్లీకి చేరుకుంటారు.
ఇదీ చూడండి:- నమస్తే ట్రంప్: 'మోటేరా' విశేషాలు ఎన్నో.. మరెన్నో