'కార్యాలయాలకు మంత్రులు సకాలంలో రావాలి' - కేబినెట్
కార్యాలయాలకు సకాలంలో రావాలని సహచర మంత్రులకు ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. క్రమం తప్పకుండా వస్తే ఇంటి నుంచి పనిచేయాల్సిన అవసరం తప్పుతుందని తెలిపారు.
మంత్రి వర్గ సహచరులకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమైన సలహా ఇచ్చారు. కార్యాలయాలకు క్రమం తప్పకుండా, సకాలంలో రావాలని సూచించారు. తద్వారా ఇంటి నుంచి పని చేసే అవసరం తప్పుతుందన్నారు. కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో మాట్లాడిన మోదీ పలు సూచనలు చేశారు.
"కొత్త వారికి సీనియర్ మంత్రులు చేదోడుగా ఉండాలి. కీలక దస్త్రాలను సహాయ మంత్రులతో పంచుకోండి. వారితో కలిసి పనిచేస్తే పరిష్కారం త్వరగా లభిస్తుంది. తాజా పరిణామాలపై అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించాలి. క్రమం తప్పకుండా కార్యాలయాలకు రావడమే కాదు.. పార్లమెంటు సభ్యులు, ప్రజలతో మమేకం కావాలి."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి: బిష్కెక్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ