లోక్‌సభతో పాటు శాసనసభ ఎన్నికలు జరిగే అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాసీఘాట్‌లో బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో లక్ష్యంగా ప్రధాని విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రణాళిక పత్రాన్ని మోసాల పత్రంగా అభివర్ణించారు మోదీ.
"ఒక వైపు ఆశయాలున్న ప్రభుత్వం ఉంది. మరో వైపు కేవలం అసంబద్ధ హామీలు ఇచ్చే వారున్నారు. వీరిలాగే వీరి మేనిఫెస్టో కూడా అవినీతితోనే నిండి ఉంటుంది. అందులో అబద్ధాలు, మోసపూరిత హామీలే ఉంటాయి. అందుకే అది ప్రణాళిక పత్రం కాదు మోసాల పత్రం."
నరేంద్ర మోదీ, ప్రధాని
ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలు పడుతుందని మోదీ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అన్నదాతలకు ఎల్లప్పుడూ తోడుంటే... ఓట్ల కోసం రైతులను హస్తం పార్టీ మభ్యపెడుతోందని మోదీ ఆరోపించారు.