భాజపా ఎమ్మెల్యే భీమా మండావి మృతికి ప్రధాని సంతాపం తెలిపారు. భాజపా అంకితభావం గల ఓ కార్యకర్తని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. మండావి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ దాడిలో మండావితో సహా అసువులు బాసిన అమర జవాన్లకు అండగా నిలుస్తామన్నారు మోదీ. జవాన్ల మృతి వృధాగా పోదన్నారు.
ఎమ్మెల్యే భీమా మండావి వాహనశ్రేణి కువకొండ నుంచి బచేలివైపు వెళ్తుండగా మావోలు దాడి చేశారు. శ్యామగిరి పర్వతాల సమీపంలో శక్తిమంతమైన ఐఈడీ పేల్చారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఎమ్మెల్యే, నలుగురు భద్రతా సిబ్బంది అక్కడికక్కడే మృతిచెందారు.