దేశ ప్రజలనుద్దేశించి మన్-కీ-బాత్‌లో ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఐరాస సర్వసభ్య సమావేశాలు ముగించుకుని శనివారమే స్వదేశానికి చేరుకున్న ఆయన.. నేడు మన్-కీ-బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శనివారమే 90వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు స్వయంగా ఫోన్ చేశారు మోదీ. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఓ వైపు.. 'డెలివరీ-ఇన్' పద్ధతిలో స్వీట్లు, గిఫ్ట్స్ ఇంటికి తెచ్చుకుంటున్న మనం.. మరోవైపు 'డెలివరీ ఔట్' గురించి కూడా ఆలోచించాలన్నారు ప్రధాని. మన ఇంట్లో అవసరం లేని, అలాగే అధిక మొత్తంలో ఉన్న వాటిని డెలివరీ ఔట్‌కు కేటాయించాలన్నారు.
పొగాకు వినియోగం వల్ల వచ్చే వ్యాధుల గురించి కూడా ప్రస్తావించారు మోదీ. యువతను మత్తుపదార్థాలకు దూరంగా ఉంచాలన్న ఆలోచనతోనే ఈ-సిగరెట్లపై నిషేధం విధించినట్లు చెప్పారు ప్రధాని.
-
PM Narendra Modi: There is very little awareness among people about e-cigarettes. They are completely unaware of its danger and for this reason sometimes e-cigarettes find their way into homes out of curiosity. https://t.co/xi7zWbN2Qf
— ANI (@ANI) September 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">PM Narendra Modi: There is very little awareness among people about e-cigarettes. They are completely unaware of its danger and for this reason sometimes e-cigarettes find their way into homes out of curiosity. https://t.co/xi7zWbN2Qf
— ANI (@ANI) September 29, 2019PM Narendra Modi: There is very little awareness among people about e-cigarettes. They are completely unaware of its danger and for this reason sometimes e-cigarettes find their way into homes out of curiosity. https://t.co/xi7zWbN2Qf
— ANI (@ANI) September 29, 2019
"పొగాకుకు బానిసగా మారడం ఆరోగ్యానికి ఎంతో హానికరం. అలాగే దాని బారి నుంచి బయటపడటం చాలా కష్టం. పొగాకు వినియోగిస్తున్న వారికి క్యాన్సర్, డయాబెటిస్, రక్తపోటు వంటి వ్యాధులు వచ్చే అవకాశముంది. ఈ-సిగరెట్లపై ప్రజలకు చాలా తక్కువ అవగాహన ఉంది. వాటి ద్వారా వచ్చే హాని గురించి ప్రజలకు పూర్తిగా తెలియదు."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి