దేశంలో మరోసారి లాక్డౌౌన్ పొడగించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నేడు జాతినుద్దేశించి ప్రసంగించే అవకాశముంది. ఈ దఫా లాక్డౌన్లో దేశ ప్రజలు పాటించాల్సిన నిబంధనలపై పలు కీలక విషయాలు వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.
కరోనాపై పోరులో భాగంగా ఈ నెల 3తో లాక్డౌన్ 2.0 గడువు ముగియనుంది. అయితే దేశంలో వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తునట్టు శుక్రవారం ప్రకటించింది కేంద్రం.
ఈసారి జోన్ల ఆధారంగా లాక్‌డౌన్‌పై సడలింపులు ఇచ్చింది కేంద్రం. రెడ్, ఆరెంజ్, గ్రీన్‌జోన్లతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య రాకపోకలు, విమాన, రైళ్ల రాకపోకలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కొన్ని నిబంధనలను కేంద్రహోంశాఖ నిర్దేశించింది.
ఇదీ చూడండి- లాక్డౌన్ 3.0: ఆ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు ఓకే