దేశంలో కరోనా నియంత్రణ కోసం మే 17వరకు లాక్డౌన్ పొడిగించిన కేంద్రం ఈ దిశగా పలు కీలక సూచనలు చేసింది. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పింది. మద్యం దుకాణాలు, వివాహాలు, అంత్యక్రియల నిర్వహణపై ప్రత్యేక సూచనలు చేసింది కేంద్రం.
- గ్రీన్‌జోన్లలో మద్యం దుకాణాలు, పాన్‌షాపులకు అనుమతి
- దుకాణాల వద్ద కనీసం 6 అడుగులు భౌతిక దూరం పాటించాలి
- దుకాణాల వద్ద ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువమంది ఉండకుండా చూడాలని ఆదేశం.
వివాహాలు, అంత్యక్రియలపై..
- వివాహాలు వంటి శుభకార్యాలకు 50 కంటే ఎక్కువ మందికి అనుమతి ఉండదు
- అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు 20 కంటే ఎక్కువ మందికి అనుమతి నిరాకరణ
- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా వేయాలని ఆదేశం
- బహిరంగ ప్రదేశాల్లో మద్యం, పాన్, గుట్కా, పొగాకు నమలడం నిషేధం