సార్వత్రిక ఫలితాల విడుదల రోజు మే 23ను 'మోదీ దివస్'గా ప్రకటించాలని యోగా గురు బాబా రాందేవ్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో భాజపా అఖండ విజయానికి గుర్తుగా ఈ వేడుకను నిర్వహించాలని ఆకాంక్షించారు.
"ఓ వైపు మహా కూటమి.. మరో వైపు ఒంటరిగా ప్రధాని నరేంద్రమోదీ. అయినా పోరాడి విజయం సాధించారు. కోట్లాది మంది ప్రజల విశ్వాసాన్ని మరోసారి గెలుచుకున్నారు. ఈ భారీ విజయానికి గుర్తుగా మే 23న మోదీ దివస్ లేదా లోక్‌కల్యాణ్ దివస్‌గా ప్రకటించాలి.
గో రక్షకులు, దొంగ రవాణా చేస్తున్న వారి మధ్య ఘర్షణలు తగ్గాలంటే గో హత్యలను నిర్మూలించటమే ఏకైక మార్గం. గో హత్యలపై పూర్తిగా నిషేధం విధించాలి. మాంసం తినాలనుకుంటే ఇతర మార్గాలు ఎన్నో ఉన్నాయి."
- బాబా రాందేవ్, పతంజలి సహ వ్యవస్థాపకుడు
ఇదీ చూడండి: కార్యకర్తల సంతోషమే మా జీవనమంత్రం: మోదీ