పౌరసేవల సామర్థ్యాన్ని పెంపొందించడానికి రూపొందించిన 'కర్మయోగి మిషన్'కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మిషన్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసలు కురిపించారు.
కర్మయోగి మిషన్ పౌర సేవల ప్రక్షాళనలో భారీస్థాయి సంస్కరణగా పేర్కొన్నారు ప్రధాని మోదీ. ఈ మిషన్ ప్రభుత్వ మానవ వనరుల నిర్వహణలో మెరుగైన ఫలితాలను ఇస్తుందన్నారు.
-
The iGOT platform will enable the transition to a role-based HR management & continuous learning. Mission Karmayogi aims to prepare Civil Servants for the future by making them more creative, constructive & innovative through transparency and technology. #CivilService4NewIndia pic.twitter.com/NxGBcAxUGo
— Narendra Modi (@narendramodi) September 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">The iGOT platform will enable the transition to a role-based HR management & continuous learning. Mission Karmayogi aims to prepare Civil Servants for the future by making them more creative, constructive & innovative through transparency and technology. #CivilService4NewIndia pic.twitter.com/NxGBcAxUGo
— Narendra Modi (@narendramodi) September 2, 2020The iGOT platform will enable the transition to a role-based HR management & continuous learning. Mission Karmayogi aims to prepare Civil Servants for the future by making them more creative, constructive & innovative through transparency and technology. #CivilService4NewIndia pic.twitter.com/NxGBcAxUGo
— Narendra Modi (@narendramodi) September 2, 2020
ఐగాట్-కర్మయోగి ప్లాట్ఫామ్ అనేది హెచ్ఆర్ మేనేజ్మెంట్, నిరంతర అభ్యాసంలో మార్పులకు శ్రీకారం చుడుతుంది. సాంకేతక పరిజ్ఞానం, పారదర్శకతతో పౌర అధికారులను మరింత సృజనాత్మకంగా, నిర్మాణాత్మకంగా భవిష్యత్తు కోసం తీర్చిదిద్దడమే ఈ మిషన్ లక్ష్యం.
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
మైలురాయి..
పౌర సేవల విభాగంలో మిషన్ కర్మయోగి అనేది 21వ శతాబ్దంలో కీలక సంస్కరణగా, మైలురాయిగా నిలుస్తుందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని ప్రశంసించారు. భవిష్యత్తు పరిస్థితులకు పౌర అధికారులను సిద్ధం చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ మిషన్ సరికొత్త పని సంస్కృతిని తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు నిరంతర శిక్షణ ఉపయోగపడుతుందన్నారు.
దూరదృష్టి..
మిషన్ కర్మయోగి కార్యక్రమంపై ప్రశంసలు కురిపించారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. పౌర అధికారుల్లో జవాబుదారీతనం, పారదర్శకతను పెంచుతూ.. వారి సామర్థ్యాని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. ఇది దూరదృష్టితో తీసుకున్న సంస్కరణగా తెలిపారు. ఐగాట్ కర్మయోగి ప్లాట్ఫామ్ ద్వారా ఎక్కడి నుంచైనా దేశంలోని 2.4 కోట్ల మంది పౌర అధికారులు నేర్చుకోవటమే కాదు.. సమస్యలకు అంతర్జాతీయస్థాయిలో పరిష్కారం సూచించే వీలుకలుగుతుందన్నారు.
ఇదీ చూడండి: పౌర సేవల ప్రక్షాళనకు 'కర్మయోగి మిషన్'