ETV Bharat / bharat

అదృశ్యమైన బాలిక చెరకు తోటలో శవమై... - UP new crime news

ఉత్తర్​ప్రదేశ్​లో అనుమానాస్పద రీతిలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. గత శుక్రవారం ఇంట్లో నుంచి కనిపించకుండా పోయిన ఆమె.. ఆదివారం సాయంత్రానికి ఓ పొలంలో శవమై కనిపించింది.

Missing UP girl found dead in sugarcane field
యూపీ: అదృశ్యమైన బాలిక చెరకు తోటలో శవమై తేలె.!
author img

By

Published : Oct 12, 2020, 3:48 PM IST

Updated : Oct 12, 2020, 4:42 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ లఖీంపుర్​ ఖేరీలో ఇటీవల అదృశ్యమైన ఓ యువతి.. చెరకు తోటలో మృతదేహమై కనిపించింది. ఇంటి ఆవరణ నుంచి కనిపించకుండా పోయిన ఆమె.. ఇలా శవంగా మారడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ జరిగింది..

పస్గావా ప్రాంతానికి చెందిన ఓ యువతి శుక్రవారం అదృశ్యమైంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆమెకోసం వెతకడం ప్రారంభించారు. స్థానిక పోలీస్​ స్టేషన్​లోనూ ఫిర్యాదు చేశారు. ఇంతలో ఆదివారం సాయంత్రం ఓ చెరకు తోటలో ఆమె శవం లభ్యమైంది.

యువతి మెడపై తీవ్ర గాయాలను గుర్తించిన పోలీసులు.. హత్యకు గురైనట్టుగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించేందుకు ఫోరెన్సిక్​ నిపుణులను పిలిపించారు.

ఈ పూర్తి వ్యవహారంపై స్థానిక ఏఎస్పీ ఏకే సింగ్​ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: ఆకులతో అద్భుతాలు- కేరళ యువతి కళకు ఫిదా

Last Updated : Oct 12, 2020, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.