భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై రాళ్ల దాడి ఘటనలో కేంద్రం, బంగాల్ ప్రభుత్వం మధ్య వివాదం తీవ్రమవుతోంది. బంగాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలను దిల్లీ రావాలని.. కేంద్ర హోం శాఖ మరోసారి నోటీసులు పంపింది. రాష్ట్రంలో శాంతిభద్రతలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: మోదీ X దీదీ: ఐపీఎస్‌ల బదిలీపై వివాదం తీవ్రం
దీదీ నో..
కేంద్రం చర్యలపై తృణమూల్ కాంగ్రెస్ మండిపడుతోంది. ప్రస్తుత కరోనా సమయంలో.. అధికారులను దిల్లీ పంపించడం కుదరదని, వర్చువల్‌గా భేటీ కావాలని అడిగింది.
ఈ వ్యవహారంపై ఇదివరకే స్పందించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. సమాఖ్య వ్యవస్థ సిద్ధాంతాలను కేంద్రం భ్రష్ఠు పట్టిస్తోందని ఆరోపించారు.
నడ్డాకు సరైన భద్రత కల్పించడంలో విఫలమయ్యారని ఇంతకుముందు ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోం శాఖ సమన్లు పంపింది. కేంద్రం డిప్యుటేషన్‌పై పనిచేయాలని వారిని ఆదేశించింది. అయితే.. తృణమూల్ సర్కార్ ఇందుకు ససేమీరా అంటోంది.
ఇదీ చూడండి: ఐపీఎస్‌ల డిప్యుటేషన్‌కు దీదీ సర్కార్ నో