ETV Bharat / bharat

కష్టాల కొలిమిలో వలస కూలీల బతుకులు

దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 2.5 లక్షల వలస కూలీలను తరలించినట్టు కేంద్రం తెలిపింది. అయితే అనేక రాష్ట్రాల్లో వలస కార్మికుల పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. సొంతూళ్లకు చేర్చమంటు అనేక మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అధికారులను వేడుకుంటున్నారు.

MIGRANTS FACING SEVERE ISSUES AMID LOCKDOWN
కష్టాల కొలిమిలో వలస కూలీలు
author img

By

Published : May 9, 2020, 6:40 AM IST

లాక్‌డౌన్‌ పొడిగింపుతో పాటు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలాగైనా సరే స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం నడుపుతున్న ప్రత్యేక రైళ్లు అందుబాటులోలేని వారు తమను సొంత ఊళ్లకు చేర్చమని కోరుతూ రోడ్లపైకి వచ్చి అధికారులను వేడుకుంటున్నారు. లాఠీదెబ్బలు తింటున్నారు. మరికొందరు వందల కిలోమీటర్ల దూరం నడిచి వెళుతూ మార్గమధ్యలో ఆకలితో అలమటిస్తున్నారు. ప్రమాదాలకు గురవుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని సొంత ఊరికి సైకిల్‌పై బయలుదేరిన వలస కార్మికుడు కృష్ణసాహూ, అతని భార్య ప్రమీల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వారి సైకిల్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

రోడ్డుపై బైఠాయించి...

గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌ సమీప గోటా ప్రాంతంలో ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌కు చెందిన వలస కూలీలు దాదాపు 2000మంది శుక్రవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద రెండు గంటలపాటు బైఠాయించారు. ఊళ్లకు పంపాలని పట్టుబట్టిన వీరికి నచ్చచెప్పి వెనక్కి పంపేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. కర్ణాటకలోని మంగళూరులోనూ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన దాదాపు 700మంది వలస కార్మికులు స్థానిక రైల్వేస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. వీరందరూ మంగళూరు పరిసర ప్రాంతాల నుంచి కాలి నడకనే రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలోని ఒక క్వారంటైన్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 22 మంది వలస కూలీలు అధికారుల కళ్లుగప్పి తప్పించుకున్నారు. తమ సొంత ఊళ్లకు బయలుదేరారు.

పాఠశాలలకు ఉచితంగా రంగులు...

ఇటానగర్​లో.. తమకు ఆశ్రయం కల్పించిన ఒక పాఠశాలకు ఉచితంగా రంగులు వేసి వలస కార్మికులు తమ కృతజ్ఞత చాటుకున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని యుపియాలోని ఒక పాఠశాలలో అసోం నుంచి వచ్చిన వలస కార్మికులకు ఆశ్రయం కల్పించగా వారు ఆ పాఠశాలకు రంగులు వేసినట్లు అధికారులు తెలిపారు.

'222రైళ్ల నడిపాం'

వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు 222 ప్రత్యేక రైళ్లను ఇప్పటి వరకూ నడిపినట్లు కేంద్రహోంశాఖ శుక్రవారం ప్రకటించింది. ఈ రైళ్ల ద్వారా సుమారు 2.5లక్షల మందిని తరలించినట్లు హోంశాఖ సంయుక్త కార్యదర్శి పున్యశైల శ్రీవాస్తవ విలేకరులకు తెలిపారు.

కాంగ్రెస్​ హైల్ప్​లైన్​ సేవలు...

వివిధ రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వెళ్లాలనుకునే వలస కార్మికులు తమ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్లకు ఫోన్‌ చేసి సాయం పొందవచ్చని కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వలస కార్మికులకు అవసరమైతే టికెట్ల ఖర్చు సంబంధిత రాష్ట్రాల కాంగ్రెస్‌ కమిటీలు(పీసీసీ) భరిస్తాయని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియగాంధీ ఇటీవల ప్రకటించిన విషయం విదితమే.

నంబర్లు ఇవే...

  • ఆంధ్రప్రదేశ్‌: 9440860961, 7286833363, 9177354456
  • ఛత్తీస్‌గఢ్‌: 9685555000, 9888763456
  • గుజరాత్‌: 7265022210
  • కర్ణాటక 9738102590, 9900599004, 9986199424, 9980915680, 9986158308, 9036419179
  • కేరళ: 9846233766, 9847940558
  • మహారాష్ట్ర: 9967132702, 8788918411
  • తమిళనాడు: 8056277615
  • తెలంగాణ: 9666594666, 7799811112
  • దిల్లీ: 9205451068, 9990426801

'వ్యాధుల ముప్పు...'

ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు కొవిడ్‌-19 బారిన పడే ప్రమాదం పొంచి ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) డైరెక్టర్‌ జనరల్‌ ఆంటోనియో విటోరినో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణ ఆంక్షల కారణంగా భవిష్యత్తులో వలస కార్మికులపై మరింత వివక్ష పెరిగే అవకాశం ఉందన్నారు. సరిహద్దుల్లో వారిని నిలిపివేస్తున్నందు వల్ల ఆహారంతో పాటు కనీస వైద్య సదుపాయాలకూ నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.