ETV Bharat / bharat

వలస కూలీల ఆగ్రహం- ఉత్తర భారతంలో ఉద్రిక్తత

author img

By

Published : May 17, 2020, 3:58 PM IST

ఉత్తరప్రదేశ్​- మధ్యప్రదేశ్​ సరిహద్దు ప్రాంతమైన ఛక్​ఘాట్​లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేసి మరీ వలస కార్మికులు ఉత్తరప్రదేశ్​లోకి అడుగుపెట్టారు. మరోవైపు శ్రామిక్​ రైళ్లను రద్దు చేశారనే కారణంతో గుజరాత్​లోని రాజ్​కోట్​లో వాహనాలను ధ్వంసం చేశారు వలస కూలీలు.

Migrant workers break police barricades at Uttar Pradesh-Madhya Pradesh border
వలస కూలీల ఆగ్రహం.. వాహనాలు ధ్వంసం

వలస కూలీల ఆగ్రహం రోజురోజుకు కట్టలు తెంచుకుంటోంది. లాక్​డౌన్​ కారణంగా ఇన్ని రోజులు తాము పడిన కష్టాలు కోపం రూపంలో బయటకు చూపిస్తున్నారు.

తాజాగా ఉత్తరప్రదేశ్​- మధ్యప్రదేశ్​లోని ఛక్​ఘాట్​ వద్ద వందలాది మంది కార్మికులు గుమిగూడారు. పోలీసులు అనుమతినివ్వకపోవడం వల్ల సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేసి ఉత్తరప్రదేశ్​లోకి అడుగుపెట్టారు.

అన్ని ఏర్పాట్లు చేసినా...

ఉత్తరప్రదేశ్​లోని సహన్​పుర్​ జిల్లాలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనేక మంది కూలీలులు వసతి గృహాల నుంచి బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఇళ్లకు వెళ్లలేకపోతున్నామనే కారణంతో లాఠీలు, కర్రలు చేతిలో పట్టుకుని అంబాలా రహదారిపై పరుగులు తీశారు. వారిని శాంతిపజేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు.

వీరందరూ హరియాణా, పంజాబ్​ నుంచి ఉత్తరప్రదేశ్​కు వచ్చిన వలస కూలీలు. వీరికి వసతి ఏర్పాట్లు చేసి ఆహారాన్ని అందిస్తున్నారు. అక్కడ నుంచి సొంతూళ్లకు వెళ్లడానికి ప్రవేటు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇళ్లకు వెళ్లడం ఆలస్యమవుతోందని.. వలస కార్మికులు నిరసన తెలిపారు.

రైళ్లు లేవని...

గుజరాత్​లో ఈరోజు బిహార్​, ఉత్తరప్రదేశ్​కు వెళ్లాల్సిన రెండు శ్రామిక్​ రైళ్లను కొన్ని కారణాల వల్ల రద్దు చేశారు అధికారు. దీనితో ఆగ్రహించిన వలస కూలీలు.. రాజ్​కోట్​లోని షాపర్​ పారిశ్రామిక ప్రాంతంలో బీభత్సం సృష్టించారు. వాహనాలను ధ్వంసం చేశారు.

  • Gujarat: Migrant workers ransack vehicles in Shapar industrial area in Rajkot following cancellation of two 'Shramik Special' trains to Bihar & Uttar Pradesh. Rajkot SP (Rural) Balram Meena says, "Action will be taken against those involved in the incident". pic.twitter.com/2oWAPQjOsb

    — ANI (@ANI) May 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు చేపడతామని తేల్చిచెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.