ETV Bharat / bharat

భారత్​ భేరి: కూటమికే 'కింగ్​ మేకర్'​ ఓటు - లోక్‌సభ ఎన్నికలు 2019

అజిత్‌ జోగి... ఛత్తీస్‌గఢ్‌ ప్రథమ ముఖ్యమంత్రి. ఇటీవల విధానసభ ఎన్నికల తర్వాత కింగ్‌ మేకరో, కింగో అవుతారని అంతా భావించారు. ఫలితాలు మాత్రం తారుమారయ్యాయి. మరి లోక్‌సభ ఎన్నికల పరిస్థితి ఏంటి? జోగి ఏమంటున్నారు?

"మహాకూటమి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలి"
author img

By

Published : Mar 22, 2019, 4:40 PM IST

కేంద్రంలో మహాకూటమి అధికారంలోకి రావాలని ఛత్తీస్​గఢ్​ మాజీ ముఖ్యమంత్రి, ఛత్తీస్​గఢ్​ జనతా కాంగ్రెస్​ అధ్యక్షుడు అజిత్​ జోగి అభిలషించారు. ఈటీవీ భారత్​ ముఖాముఖిలో ఆయన ఇంకా ఏమన్నారంటే....

"మహాకూటమి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలి"

ప్ర: లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. పుల్వామా దాడి జరిగింది. విపక్షాలు నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నాయి. మీరేమంటారు?

జ: పుల్వామా దాడికి ముందు మోదీ గ్రాఫ్‌ పడిపోతూ ఉంది. దాడి అనంతరం పరిస్థితి మారింది. కానీ పూర్తిగా మారలేదు. నా అభిప్రాయం ప్రకారం.. ఎట్టి పరిస్థితుల్లో మోదీ, అమిత్‌ షాలు దేశాన్ని పాలించకూడదు. వారి హయాంలో సమన్వయం, ప్రేమ, స్నేహభావం దెబ్బతిన్నాయి. పూర్వ పరిస్థితులను మళ్లీ తీసుకొచ్చే నాయకత్వం దేశాన్ని పాలించాలన్నది నా కోరిక. దీనికి అత్యంత యోగ్యత కలిగింది మహాకూటమి. అందువల్లే అధికారంలోకి మహాకూటమి రావలన్నది నా అభిమతం.

ప్ర: లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ కూటమిగానే పోటీ చేస్తారా? ఈ విషయంలో నిర్ణయం కూడా తీసుకున్నట్లున్నారు?

జ: లోక్‌సభ ఎన్నికలు వస్తున్నాయని తెలిసే... విధానసభ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేశాం. ఇప్పుడు కూటమి నుంచి దూరం జరిగినంత మాత్రన పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. లోక్‌సభకు కూడా కలిసే పోటీ చేస్తాం. బహుజన్‌ సమాజ్‌ పార్టీ గురించి మాకు తెలియదు కానీ స్వతహాగా కూటమి నుంచి బయటకు వైదొలగం.

ప్ర: సీట్ల పంపిణీ గురించి ఏమైనా చర్చ జరిగిందా?

జ: ఇంత వరకు చర్చలు జరగలేదు. సమయం వచ్చినప్పుడు చూద్దాం.

ప్ర: మీరు కూడా ఈ సారి ఎన్నికల్లో పోటీచేయనున్నారని, అందుకు కూర్భా నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని వార్తలొస్తున్నాయి?

జ: ఇది నా ఇష్టానికి సంబంధించిన విషయం కాదు. ఇప్పటికే 10 ఎన్నికల్లో పాల్గొన్నాను. ఇదే నాకు ఆఖరి ఎన్నిక అని భావిస్తున్నాను. రెండు ప్రాంతాల ప్రజలు నన్ను పోటీ చేయాలని కోరుతున్నారు. బిలాస్‌పూర్‌ నుంచి ధరమ్‌జీత్‌ సింగ్‌ నిలబడుతున్నారు. కూర్భా నుంచి మరొకరు పోటీ చేయాలి. ఆ స్థానం ఖాళీగా ఉంది. ప్రజలు పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు మా పార్టీ పార్లమెంటరీ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ప్ర: ఛత్తీస్‌గఢ్‌కు మీరు ప్రథమ ముఖ్యమంత్రి. మీ అనంతరం రాష్ట్రం చాలా దూరం ప్రయాణించింది. ప్రస్తుతం మూడవ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నారు. రాష్ట్ర పయాణంపై మీ అభిప్రాయం.?

జ: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. మన రాష్ట్రానికి ఉన్న వనరులు మిగతా ఏ రాష్ట్రాలకు లేవు. మన రాష్ట్రాన్ని ధాన్యాగారంగా పిలుస్తారు. 44 శాతం భూభాగంలో సమృద్ధైన అడవి ఉంది. మన రాష్ట్ర భూభాగం మైదాన ప్రాంతం. రాష్ట్ర ప్రజలు నిజాయితీతో ఉంటారు. చాలా కష్టపడ్తారు.

ప్ర: మీరు అధికారిగా కూడా పనిచేశారు. రైతు సంక్షోభ నివారణకు రుణమాఫీ చేయటం, ఉద్యోగాలు కల్పించలేక నిరుద్యోగభృతి ఇవ్వటం... ఇవేనా పరిష్కారాలు? మరో విధంగా సహాయపడవచ్చా?

జ: ఇవన్నీ పరిష్కారాలు కావు. ఇవన్నీ ప్రజాకర్షక పథకాలు. వీటి ఆధారంగా ఎన్నికల్లో గెలవొచ్చు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఈ పథకాలన్నీ సరైనవి కావు. చేపలను పట్టే వ్యక్తి, వాటిని తినే వ్యక్తికి... చేపలు అందించటంతో వారి సమస్య పరిష్కారం కాదు. చేపలు పట్టే జాలరుకు కావాల్సిన శిక్షణ అందించాలి.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.