ETV Bharat / bharat

వృద్ధ దంపతుల కష్టాలు తీర్చిన వైరల్​ వీడియో - కాంతా ప్రసాద్​ బాబా కా ధాబా

దిల్లీలోని మాల్వియా నగర్​లో నివాసముంటున్న వృద్ధ దంపతులు... రోడ్డు పక్కనే 'బాబా కా ధాబా' పేరుతో ఓ బండిని పెట్టుకుని బతుకు తెరువు సాగిస్తున్నారు. అయితే కరోనా సంక్షోభం వీరి జీవితాన్ని కుదిపేసింది. అన్​లాక్​లోనూ ధాబాకు ఆదరణ తగ్గింది. వీరి జీవితం ప్రశ్నార్థకమైన సమయంలో.. ఓ వ్యక్తి వీరి పరిస్థితిని అర్థం చేసుకుని ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో అప్​లోడ్​ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్​గా మారింది. వృద్ధులకు అండగా నిలిచేందుకు దిల్లీవాసులు పరుగులు తీస్తున్నారు. వారి చేతి వంట తినేందుకు క్యూ కడుతున్నారు.

Many Delhiities rush to help save Baba ka Dhaba after a video of the elderly couple went viral
కరోనా చిదిమేసినా.. మానవత్వం ఆదుకుంది!
author img

By

Published : Oct 8, 2020, 3:39 PM IST

Updated : Oct 8, 2020, 3:49 PM IST

దేశంలో ఎన్ని ఘోరాలు, దారుణాలు జరుగుతున్నా... ఒక్క చిన్న సంఘటన చాలు మానవత్వం బతికే ఉందని చెప్పడానికి. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఒక్క చిన్న ఆశ చాలు మనల్ని ముందుకు నడనపటానికి. వీటిని రుజువు చేస్తూ.. దిల్లీలో ఓ ఘటన వెలుగుచూసింది. కరోనాతో బతుకు తెరువు ప్రశ్నార్థకంగా మారిన వృద్ధ దంపతులను ఆదుకునేందుకు ఇప్పుడు దిల్లీ అంతా కదిలి వెళుతోంది.

బాబా కా ధాబా

దిల్లీలోని మాల్వియా నగర్​లో ఉంటున్న కాంతా ప్రసాద్​, బదామి దేవి దంపతులు.. తమ కష్టాన్ని నమ్ముకుని జీవితాన్ని గడుపుతున్నారు. ఎన్నో ఏళ్లుగా 'బాబా కా ధాబా' పేరుతో రోడ్డుపక్కన ఓ చిన్న బండిలో ఆహార పదార్థాలను అమ్ముకుంటున్నారు. వచ్చిన డబ్బుతో జీవితాన్ని సాగిస్తున్నారు.

Many Delhiities rush to help save Baba ka Dhaba after a video of the elderly couple went viral
ధాబాలో

అయితే వీరి జీవితాన్ని కరోనా సంక్షోభం ఒక్కసారిగా కుదిపేసింది. కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్​డౌన్​తో వీరి వ్యాపారం మూతపడింది. అన్​లాక్​ తర్వాత తెరుచుకున్నప్పటికీ... ఎవరూ తినేందుకు ముందుకు రావడం లేదు. ఉదయం 6:30 నుంచి అర్ధరాత్రి 1:30గంటల వరకు పని చేస్తున్నా .. రోజుకు రూ.60 మాత్రమే సంపాదించగలుగుతున్నారు. ఫలితంగా పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

ఒక్క వీడియోతో...

ఈ సమయంలోనే దిల్లీకి చెందిన గౌరవ్​ వాసన్​ అనే వ్యక్తి మాల్వియా నగర్​కు వెళ్లారు. అక్కడే 'బాబా కా ధాబా'లో పని చేస్తున్న వృద్ధులను చూశారు. వారు పడుతున్న కష్టాలకు చలించిపోయి కన్నీరు పెట్టుకున్నారు. వారి పరిస్థితిని ప్రపంచానికి తెలియజేసేందుకు ఓ వీడియో రూపొందించారు.

వీడియోలో ఆ వృద్ధులను, వారి బండిని చూపించారు గౌరవ్​. ఈ వయస్సులోనూ తమ శ్రమ మీద ఆధారపడి డబ్బులు సంపాదిస్తున్న వృద్ధులకు సహాయం చేయాలని కోరుతూ.. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో అప్​లోడ్​ చేశారు.

  • So guys I went to #MalviyaNagar and found these very old couple working hard to earn a living, when I went there and saw them struggling, I couldn't stop but cried. They said they start early at 6.30 am and by 1.30 am they could only earn Rs 60/- #VocalForLocal pic.twitter.com/avyXXVaMF2

    — Gaurav Wasan (@gauravwasan08) October 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వీడియో ఒక్కసారిగా వైరల్​ అయ్యింది. ట్విట్టర్​లో ట్రెండింగ్​గా మారిపోయింది. తమ పరిస్థితిని చెప్పుకుని కన్నీరు పెట్టుకున్న కాంతా ప్రసాద్​ను చూసిన ప్రతి ఒక్కరి మనసు కదిలిపోయింది. వారికి తమవంతు సహాయం చేసేందుకు దిల్లీవాసులు పరుగులు తీశారు. దీంతో నిన్నటివరకు బోసిపోయిన 'బాబా కా ధాబా' ఒక్కసారిగా కస్టమర్లతో కళకళలాడిపోయింది. వృద్ధ దంపతుల వంటలను రుచి చూసేందుకు ఇప్పుడు క్యూలో నిలబడుతున్నారు.

బాబా కా ధాబా వద్ద బారులు తీరిన ప్రజలు

తమకు లభించిన ఆదరణపై వృద్ధ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. యావత్​ దేశం తమ వెంటే ఉన్నట్టు అనిపిస్తోందని ఆనందిస్తున్నారు.

  • #WATCH: "It feels like whole India is with us. Everyone is helping us", says Kanta Prasad, owner of #BabaKaDhabha.

    The stall in Delhi's Malviya Nagar saw heavy footfall of customers after a video of the owner couple went viral. pic.twitter.com/nNpne6Arqs

    — ANI (@ANI) October 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #WATCH "There were no customers, we had to return home with food.... Now we are happy, it feels like we've many extended families," says Badami Devi of #BabaKaDhabha.

    The stall in Delhi's Malviya Nagar saw heavy footfall of customers after video of the owner couple went viral. pic.twitter.com/KG2WjQuYTo

"దేశమంతా మాతోనే ఉన్నట్టు అనిపిస్తోంది. ప్రతి ఒక్కరు మాకు సహాయం చేస్తున్నారు. వండిన ఆహారాన్ని అలాగే ఇంటికి తీసికెళ్లిపోయే వాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రతి ఒక్కరూ మమ్మల్ని వారి కుటుంబసభ్యుల్లా చూసుకుంటున్నారు."

--- కాంతా ప్రసాద్​, బదామి దేవి.

ఇదీ చూడండి:- పాప ప్రాణం కోసం అంబులెన్స్​ డ్రైవర్​ సాహసం!

Last Updated : Oct 8, 2020, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.