నేరాలకు పాల్పడే వారిని పోలీసులు అరెస్టు చేయడం సహజం. కానీ ఆ నేరస్థుడు ఏకంగా పోలీసు పరీక్ష రాయడానికి వెళ్లి అధికారులకు చిక్కితే? ఇలాంటి ఘటనే తమిళనాడులోని మధురై జిల్లాలో చోటుచేసుకుంది.

ఇదీ జరిగింది...
మధురై జిల్లాలోని క్రిష్ణపురమ్లో గొలుసు దొంగతనానికి పాల్పడ్డాడు విజయకాంత్. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా అతడిని పోలీసులు గుర్తించారు.
మధురై జిల్లాలో మెల్లుర్లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఆదివారం పోలీసు ట్రైనీ పోస్టులకు పరీక్ష నిర్వహించారు. విజయకాంత్ ఆ పరీక్షకు హాజరయ్యాడు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు కళాశాలకు చేరుకున్నారు. పరీక్ష రాసి బయటకు వచ్చిన విజయకాంత్‌ను అరెస్టు చేశారు.

ఇదీ చూడండి:- జైట్లీ అంత్యక్రియల్లో మంత్రి ఫోన్ దొంగతనం