ETV Bharat / bharat

తాగుబోతు వీరంగానికి ఒకరు బలి - crime news in karnataka

ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో అలజడి సృష్టించాడు ఓ వ్యక్తి. మద్యం మత్తులో ఉన్మాదిలా మారాడు. కనబడిన వారిపైనల్లా కత్తితో దాడి చేశాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయియి.

Man goes on stabbing spree, kills one, injures six in karnataka
తాగుబోతు వీరంగం.. ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు
author img

By

Published : Oct 18, 2020, 7:47 PM IST

కర్ణాటకలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి.. వీరంగం సృష్టించాడు. అతడి ఘాతుకానికి ఒకరు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఏం జరిగిందంటే..

బెంగళూరు కాటన్​పేట్​లోని 30 ఏళ్ల గణేశ్​ కూలీ పనులు చేస్తూ జీవిస్తుంటాడు. అతడు స్థానికంగా ఉండే ఓ మాంసాహార దుకాణానికి వెళ్లి, అక్కడి కత్తి లాక్కుని పరారయ్యాడు. మార్గ మధ్యలో ఆరుగురిపై దాడి చేశాడు. వారిలో ఓ వ్యక్తి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.

దాడి సమాచారం అందగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుడిని బంధించి, అతడి దగ్గర నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐపీసీ​ 302, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దాడికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

ఇదీ చూడండి:వాటర్​ టాక్సీ సర్వీసులు ప్రారంభించిన కేరళ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.