ఓటర్లను ప్రభావితం చేసేందుకు అధికార భాజపా... కేంద్ర బలగాలను ఉపయోగించిందన్నారు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పోలీస్ దుస్తుల్లో భాజపా, ఆరెస్సెస్ కార్యకర్తలు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లుందని 24 పరగణాల జిల్లా బసంతి ఎన్నికల ర్యాలీ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
"నేను కేంద్ర బలగాలను అవమానించడం లేదు. కానీ ఓటర్లను ప్రభావితం చేసేందుకు వారికి ఆదేశాలున్నాయి. కేంద్ర బలగాల మోహరింపు కారణంతో భాజపా, ఆరెస్సెస్ కార్యకర్తలు పశ్చిమ్ బంగలోకి ప్రవేశించారు."
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
కేంద్ర బలగాల కాల్పుల్లో తృణమూల్ కార్యకర్త ఒకరు గాయపడ్డారని ఆరోపించారు మమత.
ఓటేసేందుకు వరసల్లో నిల్చున్న వారిని కేంద్ర బలగాలు భాజపాకు ఓటేయమని కోరారన్నారు.
ఆరో దశ ఎన్నికల్లో పశ్చిమ బంగలోని 8 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ జరిగింది. ఈ దఫా ఎన్నికల కోసం 770 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది ఈసీ.
ఇదీ చూడండి: భాజపా అభ్యర్థి సంజయ్ జైస్వాల్‌పై కర్రలతో దాడి..