పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా బంగాల్ సీఎం మమతా బెనర్జీ లాంగ్ మార్చ్‌కు పిలుపునివ్వడాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్ తప్పుపట్టారు. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఇలా వ్యవహరించడం సరికాదని ట్వీట్ చేశారు.
మమత చర్యలు రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను మరింత ప్రేరేపించేవిగా ఉన్నాయని ఆరోపించారు. బంగాల్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి కృషిచేయాలన్న జగదీప్ ధంఖర్...రాజ్యాంగ విరుద్ధమైన ఈ ర్యాలీ నుంచి మమత తప్పుకోవాలని కోరారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు కోల్‌కతాలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి ప్రారంభమయ్యే పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక ర్యాలీకి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మమతా ట్విట్టర్‌లో పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ జగదీప్ ధంఖర్.. దీదీని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.