ETV Bharat / bharat

'ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​'లో కశ్మీరీ యువ రచయిత - రచయిత

దక్షిణ కశ్మీర్​ పుల్వామా జిల్లాకు చెందిన యువ రచయిత సరాఫ్​ అలీ భట్​ ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు దక్కించుకున్నాడు. భట్​ రాసిన రెండు పుస్తకాలకు పాఠకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అతను అంతర్జాతీయంగా మంచి పేరు సంపాదించేందుకు ఆ పుస్తకాలు సహాయపడ్డాయి.

A young writer from Pampore
యువ రచయిత సరాఫ్​ అలీ భట్​
author img

By

Published : Nov 15, 2020, 6:07 PM IST

కశ్మీర్​లో యువత పెడదారులు తొక్కటం ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. అన్ని అవరోధాలను అధిగమించి తమ సత్తా చాటుతూ రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా మారుతున్నారు. అలాంటి కోవకు చెందిన వాడే దక్షిణ కశ్మీర్​లోని పుల్వామా జిల్లాకు చెందిన 20ఏళ్ల యువ రచయిత. తనలోని ప్రతిభతో ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించుకున్నాడు.

జిల్లాలోని కద్లాబల్​ ప్రాంతానికి చెందిన సరాఫ్​ అలీ భట్​.. ఇప్పటి వరకు రెండు పుస్తకాలు రాశాడు. తన తొలి పుస్తకం 'ఏ స్మైల్​ వర్త్​ ఏ బిలియన్​ పోయమ్స్​' 2018లో పబ్లీష్​ అయింది. రెండోది 'ట్రిగ్గర్డ్​ సోర్స్​' పుస్తకం 2019లో పబ్లీష్​ అయింది. ఈ రెండు పుస్తకాలకు మంచి ఆదరణ లభించింది. అంతర్జాతీయంగా సరాఫ్​కు మంచి పేరు వచ్చేందుకు దోహదపడింది.

"ట్రిగ్గర్డ్​ సోర్స్​కు 2019లో అంతర్జాతీయ స్థాయిలో రీడర్స్​ ఛాయిస్​ అవార్డ్​ లభించింది. ప్రశంసాపత్రంతో పాటు 50 డాలర్ల నగదు బహుమతి పొందాను. ఆ తర్వాత ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు లభించింది. కశ్మీరీ యువతలోని ప్రతిభను బయటపెట్టేందుకు సరైన వేదికలు లేవు. కానీ, మా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ప్రజలు తమ కలలను వదులుకోవాలని నేను కోరుకోను. రచన అనేది పూర్తిస్థాయి వృత్తిగా ఉండే కాలంలో కశ్మీర్​ లేదు. వారి కళాత్మకతను వృత్తిగా కాకుండా ఒక అభిరుచిగా మార్చుకోవాలని సూచిస్తున్నా. నాకు పాఠకులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి మంచి ప్రేరణ లభించిన తర్వాత రచనను కొనసాగించాను. అందరి సహకారంతో రచయితల సంఘంలో చేరగలిగాను."

- సరాఫ్​ అలీ భట్​, యువ రచయిత

ఇంజినీరింగ్​ విద్యార్థి అయిన భట్​.. ఎప్పుడూ సాహిత్యం పట్ల ఆసక్తితో ఉండేవాడు. ఎనిమిదో తరగతి నుంచే వివిధ విషయాలపై క్రమం తప్పకుండా రచనలు చేసేవాడు.

ఇదీ చూడండి: ఒక్క లేఖతో చిన్నారి కుటుంబంలో 'దీపావళి' వెలుగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.