మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. దేశంలో రికార్డు స్థాయిలో కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. పుణెలో కూడా తీవ్రత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం పుణెలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాలని ఠాక్రే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
10 రోజుల పాటు..
ఈ నెల 13 నుంచి 23 వరకూ లాక్‌డౌన్ కొనసాగనుంది. పుణె, పింప్రి-చించ్వాడ్, పుణె గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ కొనసాగుతుందని ఈ మేరకు అధికారులు వెల్లడించారు. పాల ఉత్పత్తులు, ఔషధ దుకాణాలు మాత్రమే తెరిచి ఉంటాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మహారాష్ట్రలో కరోనా రికార్డు- కొత్తగా 7,862 కేసులు